రాహు సంచారం.. ఈ రాశుల వారికి కష్టాలు తప్పవు!
నెల రోజులకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి, ఆరు నెలలకు ఒకసారి గ్రహాలు రాశి సంచారం లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాయి. అయితే రాహు గ్రహం 2026లో తన రాశిని మార్చుకోనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి లక్కు తీసుకొస్తే, మరికొన్ని రాశుల వారికి కష్టాలను తీసుకొస్తుంది. అయితే రాహు గ్రహం 2026లో కుంభరాశిలోకి ప్రవేశించి, అదే రాశిలో సంవత్సరం మొత్తం ఉండనుంది. దీంతో ఇది కొన్ని రాశుల వారిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూద్దాం
Updated on: Nov 29, 2025 | 3:24 PM

కుంభ రాశి : కుంభ రాశి వారికి రాహు గ్రహం సంచారం వలన పనుల్లో ఆటంకం ఎదురు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువఅవుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్థులు కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదుర్కుంటారు.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి వ్యాపారం అస్సలే కలిసి రాదు. చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. కుటుంబ కలహాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. ఖర్చులు అధికం అవుతాయి. విద్యార్థులు కష్టపడితేగాని మనీ సపాదించలేరు.

మీన రాశి : మీన రాశి వారికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అనవసర విషయాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఖర్చులు అధికం అవుతాయి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే సమస్యల్లో చిక్కుకుంటారు.

కన్యా రాశి : కన్యారాశి వారికి అనుకోని కష్టాలు ఎదురు అవుతాయి. ఆర్థిక సమస్యలు అధికం అవుతాయి. విద్యార్థులు చాలా కష్టపడితే తప్ప ఫలితం లభించదు. అనుకోని మార్గాల ద్వారా ఆదాయం అందినప్పటికీ, అధిక ఖర్చులు అనేక సమస్యలను తీసుకొస్తాయంట.

వృషభ రాశి : వృషభ రాశి వారికి ఖర్చులు అధికం అవుతాయి. వ్యాపారస్తులు తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం అస్సలే మంచిది కాదు. కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.



