- Telugu News Photo Gallery Spiritual photos Diwali 2025: Rare Vaibhava Lakshmi Rajyogam After 500 Yrs – 3 Signs to Prosper!
దీపావళిన 500 ఏళ్ల తర్వాత అరుదైన వైభవ లక్ష్మీ రాజయోగం.. ఈ రాశులపై ధనలక్ష్మీ కాసుల వర్షం..
ఈ సంవత్సరం దీపావళి పండగ అద్భుతంగా ఉండబోతుంది. వేద క్యాలెండర్ ప్రకారం ఈ దీపావళికి అనేక శుభ , రాజ యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ సంవత్సరం దీపావళి నాడు అద్భుతమైన వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడనుంది. ఈ యోగం వలన కొన్ని రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులను తెస్తుంది. ముఖ్యంగా ధనలక్ష్మి ఆశీస్సులతో విజయం, పురోగతి , ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
Updated on: Oct 15, 2025 | 12:44 PM

దీపావళి పండగ సోమవారం, అక్టోబర్ 20, 2025న జరుపుకుంటారు. ఇది దీపాల వెలుగుతో ఆనందాన్ని ఇచ్చే రోజు మాత్రమే కాదు.. వేద జ్యోతిషశాస్త్రం దృక్కోణంలో కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ సంవత్సరం దీపావళి రోజున అనేక గ్రహ స్థానాలు మారనున్నాయి. దీంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా దాదాపు 500 సంవత్సరాల తర్వాత అరుదైన , శక్తివంతమైన వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతుంది.

కన్యారాశిలో చంద్రుడు (శ్రేయస్సుకు కారకుడు).. శుక్రుడు (లక్ష్మి చిహ్నం) కలయిక జరగనుంది. దీంతో వైభవ లక్ష్మీ రాజ్యయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ ఏడాది దీపావళి చాలా శుభప్రదంగా, ఫలవంతంగా ఉంటుంది. ఈ యోగా ముఖ్యంగా కొన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. వారు సంపద, కెరీర్ పురోగతి, ఊహించని లాభాలు, విదేశీ ప్రయాణాలలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ రోజు ఏ రాశుల వారు ప్రయోజనం పొందనున్నారో తెలుసుకుందాం..

కన్య రాశి: ఈ వైభవ లక్ష్మీ రాజయోగం కన్య రాశి వారికి చాలా శుభప్రదంగా , ప్రయోజనకరంగా ఉండబోతోంది. ప్రత్యేక విషయం ఏమిటంటే ఈ రాజయోగం లగ్నరాశిలో ఏర్పడుతోంది. ఇది వ్యక్తిత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని గణనీయంగా పెంచుతుంది. కొత్త అవకాశాలను సులభంగా పొందే అవకాశం ఉంది. కంపెనీలలో సీనియర్ పదవులు నిర్వహిస్తున్న వారికి కొత్త నాయకత్వ అవకాశాలు లభిస్తాయి. కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ పని లేదా ప్రయాణ అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబం, వైవాహిక జీవితానికి కూడా చాలా సానుకూల సమయం. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అవగాహన పెరుగుతుంది. సంబంధాలు బలపడతాయి. వివాహితలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతారు. పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలతో వారి జీవితాల్లో కొత్త ఆనందాన్ని తెస్తాయి.

మకర రాశి: వైభవ లక్ష్మీ రాజయోగ ప్రభావంతో మకర రాశి వారికి కొత్త , సంపన్నమైన రోజులు ప్రారంభం కానున్నాయి. ఈ రాజయోగం మీ సంచార జాతకంలో అదృష్ట స్థానంలో ఏర్పడుతోంది. ఇది ప్రత్యేక అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం బలంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లబించే అవకాశం ఉంది. వ్యాపారంలో కూడా లాభాలు పొందుతారు. ఆర్థిక స్థితిని బలోపేతం అవుతుంది. వ్యాపారస్తులు కొత్త క్లయింట్‌లను లేదా లాభదాయకమైన ఒప్పందాలను పొందే అవకాశం ఉంది. ఈ సమయం పని, వ్యక్తిగత జీవితానికి ప్రయోజనకరంగా ఉంటుంది.ఈ సమయం విద్యార్థులకు కూడా శుభప్రదం. ముఖ్యమైన పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది.వారి కష్టానికి ఫలితం లభిస్తుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ వైభవ లక్ష్మీ రాజయోగం ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ రాజయోగం జాతకంలో ఆదాయం, పెట్టుబడి రంగంలో ఏర్పడుతోంది. దీంతో వీరి ఆదాయంలో పెరుగుదలను స్పష్టంగా కలుగుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఆర్థిక రంగాలలో అయినా పెట్టుబడులు కూడా మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు కొత్త భాగస్వామ్యాలు లేదా సహకారం కోసం ఆఫర్లను అందుకోవచ్చు. ఇది భవిష్యత్తులో గణనీయమైన లాభాలకు దారితీస్తుంది. అదనంగా, మీ పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను వినే అవకాశం ఉంది. కుటుంబానికి ఆనందాన్ని తెస్తుంది. జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.




