- Telugu News Photo Gallery Spiritual photos Details of Sirimanotsavam celebrating in Vizianagaram at Andhra Pradesh
Sirimanothsavam: విజయనగరంలో ఘనంగా చేసే సిరిమానోత్సవం విశేషాలు ఇవే..
ప్రతి ఏడాది ప్రభుత్వ గౌరవాలతో విజయనగరంలో నిర్వహించనున్న శ్రీ పైడిమాంబ సిరిమానోత్సవానికి లక్షల మంది భక్తులు హాజరవుతారు. దసరా తర్వాత జరుపుకొని ఈ ఉత్సవం ఉత్తరాంధ్రలోని అది పెద్దదిగా చెబుతుంటారు. ఈ పండగకి పెద్ద చరిత్ర ఉంది. ఈ పండగకి విజయనగర వాసులంతా సంతోషంగా జరుపుకుంటారు. ఈ పండగ విశేషాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం.
Updated on: Oct 13, 2024 | 4:30 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం పట్టణంలోని పైడితల్లమ్మ దేవతకి నిర్వహించబడే పండుగని సిరిమానోత్సవం అంటారు. సిరి అంటే "లక్ష్మీ దేవత అంటే సంపద, శ్రేయస్సు"; మను అంటే "ట్రంక్" లేదా "లాగ్" మరియు ఉత్సవం అంటే పండగ. పూర్తిగా సిరిమానోత్సవం.

Pydithallamma Jathara

పైడిమాంబ ఆలయ పూజారి సాయంత్రం 60 అడుగుల పొడవైన సన్నటి చెట్టు తొర్రకి కట్టి ఉన్న కుర్చీలో కూర్చొని మూడు సార్లు కోట, ఆలయం మధ్య ఊరేగింపుగా తిరుగుతారు. ఇదే సిరిమానోత్సవంగా చెబుతారు.

ఈ చెట్టు తొర్రను ప్రతి ఏడాది వేరు వేరు ప్రదేశాల నుంచి తీసుకొని వస్తారు. దీన్ని స్వయంగా పైడిమాంబ ఎన్నుకొని గుడి పూజారి కలలో కనిపించి చెబుతారని నమ్మకం. ఆ ప్రదేశం గురించి పూజారి చెప్పగా సరిగ్గా అదే ప్రదేశంలో ఆ చెట్టు కనిపిస్తుంది. ఆ ప్రదేశం యజమాని దీన్ని పుణ్యంగా భావించి చెట్టును అమ్మవారికి సమర్పిస్తాడు.

మంచి రోజు చూసి అక్కడ చెట్టుకి పూజలు నిర్వహించి చెట్టును వేర్లతో తీసి విజయనగరం తరలిస్తారు. దీని చెక్కి పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. పైడిమాంబ జాతర మొదటి రోజు తొల్లెళ్ల ఉత్సవం ప్రారంభం అవుతుంది. రెండవ రోజున సిరిమానోత్సవం నిర్వహిస్తారు.
