AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వైవాహిక జీవిత రహస్యాన్ని వెల్లడించిన చాణక్య.. అనుసరిస్తే సుఖసంతోషాలు మీ సొంతం

ఆచార్య చాణక్యుడు కొన్ని వందల ఏళ్ల క్రితం చెప్పిన మానవ జీవన విధానం, సూత్రాలునేటికీ అనుసరణీయం. చాణక్యుడు చెప్పిన నీతి శాస్త్రంలో విషయాలు ఇప్పటికీ మన జీవితంలోని ప్రతి అంశంలోనూ సంబంధితంగా ఉన్నాయి. ఆయన బోధనలు వృత్తిలో సక్సెస్ మాత్రమే కాదు.. ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవించడంలో కూడా సహాయపడతాయి. అంతేకాదు చాణక్య సంతోషకరమైన వైవాహిక జీవితానికి రహస్యాన్ని కూడా వెల్లడించాడు.

Surya Kala
|

Updated on: Sep 18, 2025 | 11:40 AM

Share
చాణక్య నీతి రాజకీయాలు, సమాజం, విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది వైవాహిక జీవితాన్ని మెరుగుపరచడానికి విలువైన చిట్కాలను కూడా అందిస్తుంది. భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమపై మాత్రమే కాకుండా..పరస్పర అవగాహన, గౌరవం , త్యాగంపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆచార్య చాణక్య తన నీతి శాస్త్రంలో వైవాహిక జీవితాన్ని మధురంగా, స్థిరంగా మార్చడానికి సహాయపడే అనేక సూత్రాలను అందించాడు. చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడానికి చెప్పిన చిట్కాల గురించి తెలుసుకుందాం.

1 / 8
పరస్పర గౌరవం సంబంధానికి పునాది: చాణక్యుడి ప్రకారం భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటే ఆ కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటాయి. సంబంధంలో చిన్న చిన్న గొడవలు జరిగినా మన్నించుకునే తత్వం ఉండాలి. ఒకరినొకరు అగౌరవపరచుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య ప్రేమ క్రమంగా క్షీణిస్తుంది.

2 / 8
కమ్యూనికేషన్‌ను కొనసాగించండి: చాణక్య నీతి ప్రకారం భర్త భర్తల మధ్య మాటలు లేకపోతే అప్పుడు ఆ బంధం బలహీనపడుతుంది. భార్యాభర్తలు చిన్నదైనా, పెద్దదైనా ప్రతి విషయాన్ని ఒకరితో ఒకరు చర్చించుకోవాలి. భార్యాభర్తలు తమ ఆలోచనలను పంచుకోవడం వల్ల సంబంధంలో నమ్మకం, సాన్నిహిత్యం పెంపొందుతాయి.

3 / 8
త్యాగం, సహనం: ఏ సంబంధాన్నైనా కొనసాగించాలంటే త్యాగం, ఓర్పు అవసరమని ఆచార్య చాణక్యుడు నమ్మాడు. నిరంతరం మొండితనంతో ఉండడం లేదా తన భాగస్వామి లోపాలను ఎత్తి చూపడం వల్ల సంబంధం నాశనం అవుతుంది. బదులుగా మీ భాగస్వామికి ఉన్న బలాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

4 / 8
కోపం నియంత్రణ: చాణక్య నీతి ప్రకారం కోపం సంబంధాలకు అతిపెద్ద శత్రువు. భార్యాభర్తలు గొడవపడటం సహజం. అయితే వారి మాటలను నియంత్రించుకోవడం వలన వివాదం పెరగకుండా నిరోధించవచ్చు. కోపంలో మాట్లాడే కఠినమైన మాటలు సంబంధంలో చీలికను సృష్టించగలవు.

5 / 8
సుఖదుఃఖాలలో ఒకరికొకరు: చాణక్యుడి ప్రకారం నిజమైన జీవిత భాగస్వామి అంటే ఎటువంటి పరిస్థితి ఎదురైనా తన భాగస్వామికి తోడుగా ఉంటాడు. సంతోషకరమైన సమయాల్లోనైనా, విచారకరమైన సమయాల్లోనైనా భార్యాభర్తలు ఒకరికొకరు మద్దతుగా ఉండాలి. ఇది సంబంధంలో నమ్మకం, ప్రేమను పెంచుతుంది.

6 / 8
డబ్బు , కుటుంబ జీవితం మధ్య సమతుల్యత
చాణక్యుడు సంపదప్రాముఖ్యతను గుర్తించి.. అనేక విషయాలను తెలియజేశాడు. ఆర్థిక స్థిరత్వం మధురమైన సంబంధాలను కొనసాగిస్తుందని అతను నమ్మాడు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్నిగడపడానికి భార్యాభర్తలు సంయుక్తంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించాలి.

డబ్బు , కుటుంబ జీవితం మధ్య సమతుల్యత చాణక్యుడు సంపదప్రాముఖ్యతను గుర్తించి.. అనేక విషయాలను తెలియజేశాడు. ఆర్థిక స్థిరత్వం మధురమైన సంబంధాలను కొనసాగిస్తుందని అతను నమ్మాడు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్నిగడపడానికి భార్యాభర్తలు సంయుక్తంగా కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించాలి.

7 / 8
నమ్మకమే అతిపెద్ద పునాది: భార్యాభర్తల మధ్య సంబంధానికి బలమైన స్తంభం నమ్మకం. భార్యాభర్తల మధ్య నమ్మకం లోపిస్తే, ఆ సంబంధం నిలవదని చాణక్య నీతి చెబుతోంది. కనుక జీవిత భాగస్వామిని అనుమానించే బదులుగా.. వారిని నమ్మండి.

8 / 8