AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎల్‌ఏసీ ద్వారా స్మగ్లింగ్‌.. 2 ఏళ్లలో 800 కోట్ల విలువైన బంగారం..

గత రెండేళ్లుగా భారత్ చైనా సరిహద్దు మధ్యలో ఎల్‌ఏసీ ద్వారా 800 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్‌ జరిగినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ED వెల్లడించింది. ఒక చైనా దేశస్థుడు, ఓ భారతీయుడు ఈ అక్రమనికి పాల్పడ్డారు. ఇండియా-చైనా ఎల్ఏసి వెంబడి బంగారు అక్రమ రవాణా రాకెట్‌పై ED చేసిన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటికి వచ్చాయి.  

Prudvi Battula
|

Updated on: Sep 09, 2025 | 8:57 PM

Share
Gold 2 ఏళ్లలో రూ. 800 కోట్ల విలువైన 1,000 కిలోల కంటే ఎక్కువ బంగారం చట్టవిరుద్ధంగా భారతదేశానికి తీసుకువచ్చారని వెల్లడైంది. 2023, 2024 మెదక్ జరిగిన ఈ బంగారం అక్రమ రవాణాలో ఒక చైనీయుడు, కొంతమంది టిబెటన్లు, స్థానికుల ప్రమేయం ఉందని సమాచారం. గత ఏడాది జూలైలో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) ట్రస్ట్ ద్వారా 108 కిలోల విదేశీ మూలం బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకొన్నారు.

1 / 6
ఈ సంఘటన తర్వాత, విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) కింద ఈ నేరపూరిత చర్యపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఫెడరల్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసుకు సంబంధించి మంగళవారం నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్)లోని ఐదు ప్రదేశాలలో మరియు లడఖ్‌లోని ఒక ప్రదేశంలో సోదాలు నిర్వహించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) తెలిపింది.

2 / 6
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) కూడా ఈ కేసును (108 కిలోల బంగారు కడ్డీల) దర్యాప్తు చేసింది. దాని దర్యాప్తులో 1,064 కిలోల విదేశీ మూలం బంగారం ఈ విధంగా లావాదేవీలు జరిగాయని, క్రిప్టోకరెన్సీ (USDT/Tether) ద్వారా చెల్లింపులు జరిగాయని తేలింది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నివారణ (COFEPOSA) చట్టం కింద DRI 10 మందిని అదుపులోకి తీసుకుంది. వారి ఇప్పటికి కూడా కస్టడీలో ఉన్నట్లు  ED వెల్లడించింది. 

3 / 6
అక్రమంగా తరలించిన విదేశీ మూలం బంగారాన్ని భు-చుమ్-చుమ్ అనే చైనా జాతీయుడు భారతదేశంలోని టెండు తాషి అనే వ్యక్తికి LAC (టిబెట్ సెక్టార్‌లో) ద్వారా "అక్రమంగా" పంపుతున్నట్లు ED తన దర్యాప్తులో తేలిందని తెలిపింది. లడఖ్ నుండి ఢిల్లీకి అక్రమంగా రవాణా చేయబడిన బంగారు కడ్డీల రవాణాకు సంబంధించిన మొత్తం లాజిస్టిక్స్‌ను ఏర్పాటు చేయడానికి తాషి అసలు సూత్రధారి.

4 / 6
 టిబెట్ నివాసి అయిన టెన్జిన్ ఖండప్ అనే వ్యక్తి చైనా జాతీయుడి నుండి బంగారాన్ని LAC వరకు రవాణా చేసి, చైనా వైపున ఉన్న భారతీయ పోర్టర్లకు అప్పగించేవాడు. తాషి సూచనల మేరకు, టెన్జిన్ సంఫెల్ (ఖండప్ మామ) అనే వ్యక్తి చైనా నుండి 108 కిలోల బంగారాన్ని సేకరించడానికి ఇద్దరు పోర్టర్లను నియమించుకున్నాడని ED ఆరోపించింది.

5 / 6
"తాషి 2023-2024లో తన బంగారు స్మగ్లింగ్ సిండికేట్‌లోని ఇతర సభ్యుల సహాయంతో చైనా సరిహద్దు నుండి భారతదేశానికి రూ. 800 కోట్ల విలువైన 1,064 కిలోల బంగారాన్ని విజయవంతంగా అక్రమంగా రవాణా చేశాడు. ఈ బంగారాన్ని ఢిల్లీలోని వివిధ బంగారు ఆభరణాల వ్యాపారులు/డీలర్లకు విక్రయించేవారు" అని ఏజెన్సీ తెలిపింది. బంగారం కొనుగోలు కోసం చెల్లింపులు చైనాలోని భు-చుమ్-చుమ్‌కు క్రిప్టోకరెన్సీ ద్వారా జరిగేవని జోడించింది.

6 / 6