- Telugu News Photo Gallery Side effects of drinking tea in paper cups on the roadside? It can cause cancer
Side Effects Of Plastic Cup: మీరూ రోడ్డు పక్క స్కాల్స్‌లో టీ తాగుతున్నారా? జాగ్రత్త.. ప్రమాదం మీ వెంటే
టీ అంటే ఇష్టపడని ఉండరు. రోజంతా ఉత్సహంగా ఉంచడంలో టీ పాత్ర తక్కువేమీ కాదు. అయితే టీ తాగే అలవాటు ఉన్న వారు రోడ్డు పక్కన ఉండే స్టాల్స్‌లో కూడా టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. కానీ వాటిల్లో ఎల్లప్పుడు ప్లాస్టిక్ లేదా మట్టి కుండలు లేదా పేపర్ కప్పుల్లో టీ సర్వ్ చేస్తుంటారు. ఈ రకమైన కప్పులను కడగడంలో ఇబ్బంది ఉండదు. సులువుగా టీ తాగి డస్ట్‌బిన్‌లో పారేయొచ్చు. ఒక్కోసారి ఇలాంటి టీ కప్పులను ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటాం. నిజానికి ఈ రకమైన కప్పులు శరీరానికి హానికరం..
Updated on: Jan 04, 2024 | 12:23 PM

టీ అంటే ఇష్టపడని ఉండరు. రోజంతా ఉత్సహంగా ఉంచడంలో టీ పాత్ర తక్కువేమీ కాదు. అయితే టీ తాగే అలవాటు ఉన్న వారు రోడ్డు పక్కన ఉండే స్టాల్స్‌లో కూడా టీ రుచులను ఆస్వాదిస్తుంటారు. కానీ వాటిల్లో ఎల్లప్పుడు ప్లాస్టిక్ లేదా మట్టి కుండలు లేదా పేపర్ కప్పుల్లో టీ సర్వ్ చేస్తుంటారు.

ఈ రకమైన కప్పులను కడగడంలో ఇబ్బంది ఉండదు. సులువుగా టీ తాగి డస్ట్‌బిన్‌లో పారేయొచ్చు. ఒక్కోసారి ఇలాంటి టీ కప్పులను ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటాం. నిజానికి ఈ రకమైన కప్పులు శరీరానికి హానికరం. ఇవి శరీరానికి ఎలాంటి హాని తలపెడుతుందో నిపుణుల మాటల్లో మీకోసం..

ప్లాస్టిక్ కప్పులలో బిస్ఫినాల్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరానికి చాలా హానికరం. ముఖ్యంగా ఇటువంటి కప్పుల్లో టీ తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇందులో ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మక్రిములు కూడా ఉంటాయి.

పేపర్ కప్పుకు వినియోగించే పూతల్లో ఈ హానికరమైన బిస్ ఫినాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయి. ఇది టీ తాగేటప్పుడు నేరుగా కడుపులోకి వెళుతుంది.

రోజు పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో BPA పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. శరీరంలో BPA పరిమాణం పెరిగితే, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అంతే కాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. పిల్లలు ఈ కప్పుల్లో ఆడుకోవడం వల్ల మానసిక సమస్యలు తలెత్తుతాయి.





























