- Telugu News Photo Gallery Red Chili Powder: bad effects of consuming red chili powder regularly, Know here
Red Chili Powder: కారం చూస్తే కంట్రోల్ తప్పుతున్నారా? అయితే ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఎర్రటి కారం చూడగానే కొంత మందికి నోరూరిపోతుంది. దాంతో ఇష్టమైన వంటకాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే దట్టించేస్తుంటారు. అయితే ఇలా కారం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఉందా? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా?..
Updated on: Aug 27, 2024 | 8:38 PM

ఎర్రటి కారం చూడగానే కొంత మందికి నోరూరిపోతుంది. దాంతో ఇష్టమైన వంటకాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువగానే దట్టించేస్తుంటారు. అయితే ఇలా కారం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి ఏదైనా ప్రమాదం ఉందా? అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా?

ఎండు మిర్చి పొడిని వంటలో ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. బదులుగా పచ్చి మిరపకాయలు వంటలలో వాడటం మంచిది.

Irritable bowel syndrome (IBS) విరేచనాలకు కూడా దారి తీస్తుంది. ఐబిఎస్‌తో బాధపడుతున్న రోగి ఎండు మిరపకాయలతో చేసిన కారం తింటే కడుపు నొప్పితోపాటు ఇతర సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. ఎండు మిరపకాయల కారం కడుపుపైమాత్రమే కాకుండా, శరీరంలోని అనేక ఇతర భాగాలపై కూడా ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. ఎండు మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ముక్కు కారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి ముక్కు మూసుకుపోతుంది కూడా.

అధిక రక్తపోటు ఉన్నట్లయితే, ఆహారంలో కారం అధికంగా తినడం అంత మంచిది కాదు. కారం ఎక్కువగా తినడం వల్ల అడ్రినలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా రక్తపోటు అకస్మాత్తుగా పెరుగుతుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉంటే కారం తక్కువగా తినడం అలవాటు చేసుకోవాలి.

ఎండు మిరపకాయల్లో ఉండే కొన్ని పదార్థాలు అతిగా శరీరంలోకి చేరితే ప్రమాదం! అలాంటప్పుడు అలర్జీ వంటి సమస్యలు రావచ్చు. శరీరం అంతటా దద్దుర్లు కనిపిస్తాయి. చర్మం దురదగా ఉంటుంది. కాబట్టి కారం అతిగా వాడకూడదు. కారం అధికంగా తినడం వల్ల నోటిపూత చికాకు పెరుగుతుంది. కాబట్టి నోటి పుండ్లు ఉంటే ఎండు మిరపకాయలు తినకపోవడమే మంచిది.




