- Telugu News Photo Gallery Rashmika Mandanna Shares pics From Maldives; Confirmed she went Holidaying With Vijay Deverakonda to Maldives
Rashmika Mandanna Maldives Photos: దొరికిపోయిన రష్మిక! అంటే మాల్దీవులకు ఒంటరిగా వెళ్లలేదన్నమాట.. వైరల్ అవుతోన్న ఫొటోలు..
తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే నటి రష్మిక తాజాగా 'పుష్ప' మువీతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మువీ తర్వాత బాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూ కట్టాయి. ఐతే తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని మాల్దీవులకు పయనమైన రష్మిక తన వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో..
Updated on: Oct 10, 2022 | 2:42 PM

తన అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే నటి రష్మిక తాజాగా 'పుష్ప' మువీతో దేశ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ మువీ తర్వాత బాలీవుడ్‌లోనూ ఆఫర్లు క్యూ కట్టాయి. ఐతే తాజాగా తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత విరామం తీసుకుని మాల్దీవులకు పయనమైన రష్మిక తన వెకేషన్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

సముద్ర తీరాన ప్రకృతి అందాలను ఎంజాయ్ చేస్తోన్న రష్మిక ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల్లో తాను ఉంటున్న హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ ఫొటోను షేర్ చేసింది.

ఒక ఫొటోలో హోటల్ రూమ్ వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చునొ ‘ఫ్లోటింగ్ ఫుడ్’ని ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఐతే ఈ ఫొటోలో ఆమె కూలింగ్ గ్లాసెస్ ధరించారు. సదరు కళ్లజోడు విజయ్ దేవరకొండదని నెటిజన్లు గుర్తుపట్టేశారు.

ఇంకేముంది వీళ్లిద్దరూ కలిసే మాల్దీవులకు వెళ్లారన్నమాట అని ఊహించేసుకున్నారు. దీంతో సోషల్‌మీడియాలో పలు గుసగుసలు ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా మల్దీవులకు వెళ్లే ముందు ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి కనిపించిన విషయం కూడా గుర్తు చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి మాల్దీవులకు టూర్ వెళ్తున్నారంటూ వెబ్‌సైట్లలో పలు వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో రష్మిక షేర్ చేసిన ఫొటోలు మరింత వైరల్ అయ్యాయి.

రష్మిక మందన్న తాజా మువీ 'గుడ్‌బై'లో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా కూడా నటించిన విషయం తెలిసిందే. వికాస్ బహల్ తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది.





























