- Telugu News Photo Gallery Pregnant ladies should definitely take these precautions in summer, check here details in Telugu
Pregnant Ladies Care: సమ్మర్‌లో ప్రెగ్నెంట్ లేడీస్ ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే..
సాధారణంగానే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వేసవి కాలంలో మరింత కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపుతో ఉన్న మహిళలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మంచి హెల్దీ డైట్ ఖచ్చితంగా తీసుకోవాలి. వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. వేసవిలో ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే..
Updated on: Feb 27, 2024 | 5:58 PM

సాధారణంగానే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ వేసవి కాలంలో మరింత కేర్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కడుపుతో ఉన్న మహిళలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. మంచి హెల్దీ డైట్ ఖచ్చితంగా తీసుకోవాలి.

వైద్యుల సూచనల మేరకు ఆహారం తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటివి చేయాలి. వేసవిలో ఎక్కువగా బాడీ డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నీటిని, పండ్ల రసాలను కంటిన్యూగా తాగుతూ ఉండాలి.

వైసవిలో బయటకు ఎక్కువగా తిరగకూడదు. బయట ఆహారం తీసుకోవడం కూడా అంత శ్రేయస్కరం కాదు. వేసవిలో ప్రెగ్నెంట్ లేడీస్‌లో అనేక మార్పులు జరుగుతాయి. కొన్ని సార్లు ఆహారం అస్సలు తినాలనిపించదు. వికారంగా కూడా ఉంటుంది. త్వరగా నీరసపడి పోతారు.

వేసవిలో బాదాంను నానబెట్టి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజంతా శక్తిని అందించేందుకు హెల్ప్ చేస్తుంది. అదే విధంగా ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి.

వేసవిలో లభించే పుచ్చకాయలు, పండ్లు కూడా తీసుకోవాలి. దీని వల్ల బిడ్డకు మంచి పోషకాలు అందుతాయి. బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే వైద్యుల సూచనల మేరకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.




