- Telugu News Photo Gallery Political photos AP BRS Office Inauguration on May 21st 2023 in Guntur Have a Look on Photos
AP BRS Office: వచ్చే ఆదివారం ఏపీలో బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసు ఓపెనింగ్.. ఎక్స్‌క్లూజీవ్ ఫోటోలు మీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BRS అధ్యక్షులు డా.తోట చంద్రశేఖర్ గారి చేతులు మీదుగా ఈ నెల 21-05-2023 అనగా ఆదివారం ఉదయం 11:35 నిమిషాలకు అంగరంగ వైభవంగా కార్యాలయ ప్రారంభం జరుగుతుంది. ఈమేరకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఆహ్వానాలు వెళ్లాయి.
Updated on: May 18, 2023 | 5:15 PM

గుంటూరులో భారత రాష్ట్ర సమితి ఏపి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే ఆదివారం బిఆర్ఎస్ ఏపి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.

ఆటోనగర్‌లో ఐదు అంతస్థుల భవనంలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. మొదట అంతస్థులో కార్యకర్తలతో సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. రెండు మూడు అంతస్థుల్లో పరిపాలన విభాగాలను సిద్దం చేశారు.

ఇక ఐదో అంతస్తులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కార్యాలయాన్ని తీర్చి దిద్దారు. మూడు విభాగాలు అధ్యక్షుడుడి కార్యాలయాన్ని విభజించారు. అతిధులు కూర్చోనే విధంగా పెద్ద హాలు ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత ముఖ్య నేతలతో సమావేశం అయ్యేందుకు హాలు ఉంది. ఆ తర్వాత అధ్యక్షుడి గదిని తీర్చి దిద్దారు. గుంటూరులో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ఆదివారం 11.35 నిమిషాలకు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

వచ్చే ఎన్నికలకు సిద్దం అయ్యేలా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నెక్ట్స్ వీక్ నుంచి పార్టీ కార్యక్రమాలు ఇక్కడి నుంచే జరగనున్నాయి. ఏపీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అమలు చేయాలి వంటి ప్రణాళికలు ఇక్కడి నుంచే జరగనున్నాయి.
