- Telugu News Photo Gallery Onion Juice Benefits: Onion Juice Good For Cholesterol And Diabetes, Know All Benefits Here
Onion Juice Benefits: మధుమేహంతో బాధపడేవారు రోజూ గ్లాసుడు ఉల్లిపాయ రసం తాగాలట.. ఎందుకో తెలుసా?
మధుమేహం చాలా క్లిష్టమైన వ్యాధి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి మందులతో పాటు, ఈ కింది ఇంటి నివారణలు కూడా అనుసరించమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మధుమేహం ఉన్న వారు జాగ్రత్తగా ఉండకపోతే శరీరంలో అనేక ఇతర వ్యాధులు వేళ్ళూనుకు పోతాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది..
Updated on: Mar 02, 2024 | 12:59 PM

మధుమేహం చాలా క్లిష్టమైన వ్యాధి. ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉన్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ వ్యాధి నుంచి బయటపడటానికి మందులతో పాటు, ఈ కింది ఇంటి నివారణలు కూడా అనుసరించమంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే మధుమేహం ఉన్న వారు జాగ్రత్తగా ఉండకపోతే శరీరంలో అనేక ఇతర వ్యాధులు వేళ్ళూనుకు పోతాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలనుకుంటే ఉల్లిపాయ రసం తీసుకోవాలని సూచిస్తున్నారు. దీని సహాయంతో టైప్-1, టైప్-2 రోగులు తమ శరీరంలో మధుమేహాన్ని సులువుగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.

2 మధ్య తరహా ఉల్లిపాయలను సన్నగా తురుముకుని, మిక్సర్ గ్రైండర్‌లో వేసి, ఆపై 1 కప్పు నీరు, చిటికెడు బ్లాక్ సాల్ట్ లేదా బీట్ సాల్ట్, 1 టీస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని తాగడం వల్ల శరీరానికి పుష్కలంగా ఫైబర్, అనేక ఇతర అవసరమైన పోషకాలు అందుతాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ పానీయం మధుమేహాన్ని తగ్గించడంతో పాటు గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ కొద్ది మొత్తంలో ఉల్లిపాయ రసాన్ని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పచ్చి ఉల్లిపాయల్లో విటమిన్ ఎ, సి, కె ఉంటాయి. జ్యూస్ రూపంలో దీనిని తాగడం వల్ల ఈ అన్ని విటమిన్ల ప్రయోజనాలను పొందవచ్చు. ఈ విటమిన్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

మధుమేహంతో చాలా కాలంగా బాధపడేవారిలో కళ్లపై కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉల్లిపాయలో సెలీనియం ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఇ లోపాన్ని పూరిస్తుంది.




