- Telugu News Photo Gallery Cinema photos Ramcharan Game Changer to Siddharth Malhotra latest cinema news from industry
Movie News: గేమ్ చెంజర్ రిలీజ్.. సౌత్ గురించి కియారా భర్తకు ఏమని చెప్పిందంటే.?
కొన్ని కాంబినేషన్లకు, డేట్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలా ఈ ఏడాది క్రిస్‌మస్ డేట్‌ని, ఆరెంజ్‌తో ముడిపెట్టి చూసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. లైగర్ బ్యూటీ అనన్య పాండే గిన్నెల మీద మోజుపడుతున్నారు. తన లైఫ్‌లో ఎప్పుడూ ప్లేట్లు, బౌల్స్, స్పూన్‌ల ఫొటోలు తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు అనన్య. భార్యాభర్తలు ఒకే ఫీల్డ్ లో ఉంటే, ఆ కంఫర్టే వేరప్పా అని అంటున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. సౌత్ వర్క్ కల్చర్ గురించి, ఇక్కడ డిసిప్లిన్ గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి కియారా చాలా విషయాలు చెబుతుంటారట సిద్‌కి.
Updated on: Mar 02, 2024 | 12:57 PM

కొన్ని కాంబినేషన్లకు, డేట్లకు ఎప్పుడూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అలా ఈ ఏడాది క్రిస్‌మస్ డేట్‌ని, ఆరెంజ్‌తో ముడిపెట్టి చూసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ ఏడాది డిసెంబర్ 25న గేమ్‌చేంజర్‌ని విడుదల చేస్తారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గేమ్ చేంజర్. తాజాగా ఈ సినిమాను క్రిస్‌మస్ కానుకగా విడుదల చేయనున్నట్లు అఫిషియల్‌గా అనౌన్స్ చేసారు.

తన సితారే జమీన్ పర్‌ని క్రిస్‌మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామని నార్త్ లో ఆమీర్ ప్రకటించారు. ఈ సినిమాలో జెనీలియా నటిస్తున్నారు. ఈ విషయాన్ని వినగానే ఆమీర్‌తో చెర్రీ ఢీ అని కొందరు అనుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆరెంజ్ రోజులను గుర్తుచేసుకుంటున్నారు. చెర్రీ, హాసినీ మళ్లీ ఒకేరోజు థియేటర్లలో సందడి చేయబోతున్నారని మాట్లాడుకుంటున్నారు. ఎవరి యాంగిల్ వాళ్లది కదా.. ఏమంటారూ..?

లైగర్ బ్యూటీ అనన్య పాండే గిన్నెల మీద మోజుపడుతున్నారు. తన లైఫ్‌లో ఎప్పుడూ ప్లేట్లు, బౌల్స్, స్పూన్‌ల ఫొటోలు తీసుకోవాల్సి వస్తుందని అనుకోలేదని అన్నారు అనన్య. ఇప్పుడు కొత్తగా ఏ వస్తువు కనిపించినా పిక్ తీసి పెట్టుకుంటున్నానని చెప్పారు. దీపిక పదుకోన్ ఇంట్లో వస్తువులన్నీ చాలా బావుంటాయట. ప్లేట్లు, స్పూన్లు కూడా చాలా బావుంటాయట. తనకు అవకాశం వస్తే దీపిక పదుకోన్ ఇంట్లో నుంచి వాటిని కొట్టేయాలని భావిస్తున్నట్టు చెప్పారు లైగర్ బ్యూటీ అనన్య. తన కజిన్ ప్రెగ్నెంట్ కావడంతో, తనకి సడన్‌గా పెద్దరికం వచ్చినట్టుందట. దానికి తోడు కొత్త ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటుంటే, అంతా కొత్త కొత్తగా ఉందని చెప్పారు అనన్య.

భార్యాభర్తలు ఒకే ఫీల్డ్ లో ఉంటే, ఆ కంఫర్టే వేరప్పా అని అంటున్నారు సిద్ధార్థ్ మల్హోత్రా. తాను ఇప్పటిదాకా సౌత్ ఇండస్ట్రీలో పనిచేయకపోయినప్పటికీ, తనకు దక్షిణాది సినిమా పరిశ్రమ గురించి చాలా బాగా తెలుసని అంటున్నారు యోధ హీరో. సిద్ధార్థ్ మల్హోత్రా భార్య కియారా సౌత్‌లో అడపాదడపా సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా రామ్‌చరణ్‌తో కలిసి గేమ్ చేంజర్‌లో నటిస్తున్నారు.

సౌత్ వర్క్ కల్చర్ గురించి, ఇక్కడ డిసిప్లిన్ గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి కియారా చాలా విషయాలు చెబుతుంటారట సిద్‌కి. అందుకే తనకు సౌత్ ఇండస్ట్రీ బాగా అలవాటైనట్టే అనిపిస్తుందని అంటారు సిద్. ఆయన నటిస్తున్న యోధ ప్రమోషన్లలో భాగంగా ఈ విషయాలను పంచుకున్నారు సిద్. తనకు రాజమౌళితో పనిచేయాలని ఉందన్న విషయం కూడా అప్పుడే వెల్లడించారు.




