Mental Health: టెన్షన్ ఎందుకు దండగా.. కలిసి తింటే పండుగ.. కుటుంబంతో భోజనం చేస్తే ఆ రోగాలే రావంట..
Tips to reduce tension: నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడికి అనేక కారణాలున్నాయి.. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబం, సంబంధాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే.. వైద్య నిపుణులు.. ఒత్తిడి రహితంగా మారడంలో మీకు సహాయపడే ఒక సూచనను ఇస్తున్నారు.
Updated on: Sep 06, 2023 | 4:46 PM

Tips to reduce tension: నేటి ఆధునిక జీవనశైలిలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్యగా మారింది. ఒత్తిడికి అనేక కారణాలున్నాయి.. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబం, సంబంధాల సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొదలైన అనేక కారణాలు ఉండవచ్చు. మీరు ఒత్తిడికి లోనవుతున్నట్లయితే.. వైద్య నిపుణులు.. ఒత్తిడి రహితంగా మారడంలో మీకు సహాయపడే ఒక సూచనను ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని ఓ సర్వేలో తేలింది.

కుటుంబంతో లేదా ఇష్టమైన వారితో కలిసి భోజనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్వేలో తేలింది. అధ్యయనంలో కుటుంబ సమేతంగా వెయ్యి మందికి పైగా కుటుంబసభ్యులను చేర్చారు. ఈ క్రమంలో డిన్నర్, వారి కార్యాకలాపాలను పరిశోధిస్తూ.. వారిని పరీక్షించారు. ఈ సమయంలో కుటుంబంతో కలిసి భోజనం చేసేవారు లేదా వారితో రోజూ 15 నుంచి 20 నిమిషాలు గడిపేవారిలో ఒత్తిడి తగ్గుతుందని వెల్లడైందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సర్వే తెలిపింది.

తల్లిదండ్రులతో విందు: సర్వేలో.. 91 శాతం మంది తల్లిదండ్రులు కలిసి ఆహారం తినడం వల్ల తమ కుటుంబంలో ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. అదే సమయంలో, 84 శాతం మంది ఒత్తిడిని నివారించడానికి, ప్రతి రోజు తమ కుటుంబంతో గడపాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. అంతేకాకుండా.. ఆరోగ్యం విషయంలో పలు మార్పులను కూడా గమనించినట్లు తెలిపారు.

సర్వే ఏం చెబుతోంది?: ప్రస్తుతం పని భారంతో కుటుంబానికి దూరమవుతున్నారని సర్వేలో తేలింది. కొందరు వేరే ఊరు లేదా దేశానికి వెళ్లి వారికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మరికొందరు కలిసి జీవిస్తున్నప్పటికీ వారితో సమయం గడపలేకపోతున్నారు. దీని కారణంగా, ప్రజలు సాధారణంగా ఒంటరితనానికి గురవుతారు. ఈ ఒంటరితనం వారిని క్రమంగా ఒత్తిడి, నిరాశకు దారి తీస్తుంది. ఈ ఒత్తిడి కుటుంబంలో కలహాలకు కారణమవుతుంది. అందుకే రోజూ కనీసం 15 నిమిషాలైనా కుటుంబంతో గడపాలి.

సామాజిక సంబంధాలను మెరుగుపరుస్తాయి: ఇతరులతో కలిసి భోజనం చేయడం అనేది ఒత్తిడిని తగ్గించడానికి, ఆత్మగౌరవాన్ని పెంచడానికి, సామాజిక బంధాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా పిల్లలకు ఇది ఉత్తమమైన మార్గం.. స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులు, పొరుగువారితో కనెక్ట్ అవ్వడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ సర్వేలో 67 శాతం మంది కలిసి భోజనం చేయడం వల్ల ఇతరులతో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు.

గుండె జబ్బుల ప్రమాదం: ఎక్కువ కాలం ఒత్తిడికి లోనయ్యే వారికి అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి రక్తపోటు స్థాయిని పెంచుతుంది.. ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణంగా పరిగణిస్తారు. ఒత్తిడిని ఎక్కువ కాలం పరిమితం చేయకపోతే, తీవ్రమైన పరిస్థితుల్లో గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులకు కూడా కారణం కావచ్చు.




