- Telugu News Photo Gallery Cinema photos Latest Telugu Movies Updates from Salaar to Tiger Nageswara Rao
Movie Update: సలార్ డబ్బింగ్ లో ప్రభాస్.. ఏక్ ధమ్ ధమ్ అంటున్న రవితేజ.. సలార్ టు టైగర్ నాగేశ్వరరావు తాజా సినిమాల అప్డేట్స్..
మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రవితేజ, వంశీ కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న చిత్రం ఆదికేశవ. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమా కాబట్టి సెట్స్ వేయడానికి సమయం పడుతుందని తెలిపారు నిర్మాత ఏఎం రత్నం. హృతిక్ శౌర్య, తన్వీ నేగి జంటగా రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓటు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Sep 06, 2023 | 5:00 PM

హృతిక్ శౌర్య, తన్వీ నేగి జంటగా రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఓటు.. చాలా విలువైనది అనేది ట్యాగ్‌లైన్. తాజాగా ఈ సినిమా నుంచి సిరిమల్లె పువ్వా సాంగ్ రీమిక్స్ వర్షన్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా విడుదలైంది. పదహారేళ్ల వయసు పాటనే ఇందులో రీమిక్స్ చేసారు.

రవితేజ, వంశీ కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ సినిమా నుంచి ఏక్ ధమ్ ధమ్ అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో బందిపోటుగా నటిస్తున్నారు మాస్ రాజా. ఈయనకు ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పీరియాడిక్ సినిమా కాబట్టి సెట్స్ వేయడానికి సమయం పడుతుందని తెలిపారు నిర్మాత ఏఎం రత్నం. అందుకే సినిమా పూర్తవడానికి లేట్ అవుతుందన్నారాయన. అయినా కూడా 2023 చివరి నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేసి, ఎన్నికలలోపు సినిమాను విడుదల చేస్తాం అని తెలిపారు నిర్మాత ఏఎం రత్నం. ఈ అప్డేట్‌తో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

ఇక మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోన్న చిత్రం ఆదికేశవ. ఈ సినిమాను నవంబర్ 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీం..ఈ మూవీలో ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. సిత్తరాల సిత్రవతి అంటూ సాగే పాట ప్రోమో ఆకట్టుకుంటుంది.

మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈనెల 28న విడుదల కావాల్సి ఉంది. కానీ అనుకోకుండా వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రభాస్ డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశారట. తెలుగు, కన్నడ భాషల్లో ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నారు.





























