- Telugu News Photo Gallery Low Pressure In Bay Of Bengal, Light To Moderate Rains Till September 14 In Andhra Pradesh
వదలని వరుణుడు.. తెలుగు రాష్ట్రాలకు వచ్చే 3 రోజులు వానలే వానలు.!
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారతవాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 14 వరకూ రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సెప్టెంబర్ 12 కల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.
Updated on: Sep 11, 2023 | 12:37 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు భారతవాతావరణశాఖ హెచ్చరిక జారీ చేసింది. సెప్టెంబర్ 14 వరకూ రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అండమాన్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సెప్టెంబర్ 12 కల్లా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది.

ఈశాన్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రకటించింది. ఇప్పటికే ఏపీలోని కోస్తా జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 14వరకు ఉభయ తెలుగు రాష్ట్రలకు వర్ష సూచన ఉన్నట్టు ఐఎండీ ప్రకటించింది.

కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండి తన తాజా వెదర్ బుల్లెటిన్‌లో పేర్కొంది. రేపటికి బంగాళాఖాతంలో మరో ఉపర్తల ఆవర్తనం ఏర్పడనుంది.

ఈ క్రమంలోనే కోస్తాంద్రా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఉత్తర కోస్తా లో చాలాచోట్లా, దక్షిణకొస్తా జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు.. కొన్నిచోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలాగే తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ అధికారులు చెప్పారు. సముద్రంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని సూచించింది.