- Telugu News Photo Gallery Know the dangers of eating too many bananas, here we will see which people should not eat bananas
Lifestyle: అరటి పండ్లు ఎక్కువగా తింటున్నారా? అయితే వాటి ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా తెలుసుకోండి!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనం అనేక రకాల పండ్లను తీంటుంటాం. వాటిలో అరటిపండు కూడా ఒకటి. దీన్ని సపరేటుగా తినడంతో పాటు అనేక రకాల వంటకాల్లో కూడా ఉపయోగిస్తారు. అయితే ఈ అరటిపండును అధికంగా తినడం అందిరికీ మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు వీటిని ఒక మొతాదు వరకే సుతీకోవాలని చూసిస్తున్నారు. అయితే ఎవరూ వీటిని ఎంత మీరు తినాలో ఇప్పుడు తెలుసుకుందా పదండి.
Updated on: Aug 09, 2025 | 5:06 PM

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనం అనేక రకాల పండ్లను తీంటుంటాం. వాటిలో ఒకటి అరటిపండు కూడా ఒకటి. జిమ్‌కు వెళ్లే చాలా మంది ఈ పండును తీసుకుంటారు.

ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి లక్షణాలు ఉన్నాయి, ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి.

కానీ అరటిపండు అందరికీ ప్రయోజనకరం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును మీరు విన్నది నిజమే. FMRI గుర్గావ్‌లోని క్లినికల్ న్యూట్రిషన్స్ ప్రకారం.. మీరు ఎప్పుడైనా ఏ పండ్లనైనా తినవచ్చు, కానీ మీరు బరువు తగ్గాలనుకుంటే, తక్కువ పరిమాణంలో అరటిపండ్లు తినమని సలహా ఇస్తున్నారు.

న్యూట్రిషన్స్ ప్రకారం.. మీరు బరువు తగ్గాలని ఆలోచిస్తుంటే, అరటిపండ్ల ఎక్కవగా తినడం ఆపేయండి. అలా పూర్తిగా ఆపేయడం కూడా మంచింది కాదు. ఎందుకంటే అరటిపండు శరీరానికి పొటాషియం అందించే ఒక మంచి ప్రూట్. కాబట్టి మీరు తీసుకునే ప్రూట్‌బౌల్ అరపండును కూడా తీసుకోండి కాని తక్కువ పరిమాణంలో.

బరువు తగ్గాలనుకునే వారు కొంత మేరైనా అరపండును తినవచ్చు. కానీ కిడ్నీ రోగులు మాత్రం అస్సలు అరటి పండును తినొద్దని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుందని, ఇది కిడ్న సమస్యలపై ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. కావున మీరు కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే, పొరపాటున కూడా ఈ పండును తినవద్దని వైద్యులు సూచిస్తున్నారు.( గమనిక పై పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇవ్వబడ్డాయి. కాబట్టి వీటిలో మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్ లేదా, ఇదర వైద్యులను సంప్రదించండి)




