- Telugu News Photo Gallery Include these foods in your diet to improve your digestion naturally at home
Health Tips: జీర్ణక్రియను మెరుగుపర్చే సూపర్ ఫుడ్స్.. వీటిని మీ ఆహారంలో చేర్చురకుంటే.. ఆరోగ్యం మీవెంటే?
ఫైబర్ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఫైబర్ కోసం ఎక్కువగా సలాడ్స్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే సలాడ్స్‌లో ఉపయోగించే లెట్యూస్ వంటి ఆకుకూరల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందని భావిస్తారు. కానీ వాటిలో పైభర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక ఫైబర్‌ను అందించే ఇతర ఆహార పదార్థాలు ఏవో ఇక్కడ తెలుసుకుందాం.
Updated on: Sep 25, 2025 | 3:53 PM

ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు ఫైబర్ ఒక ముఖ్యమైన భాగం. జీర్ణక్రియకు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఫైబర్ ఎంతగానో సహాయపడుతుంది. మనం ఒక రోజు తినే ఆహారంలో ఎంత ఫైబర్ ఉందో మీకు తెలుసా?

ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పోషకాహార నిపుణుల ప్రకారం.. ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా.. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది, అలాగే కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా ఆకలిని కూడా తగ్గిస్తుంది.

అరటిపండు: అరటిపండ్లలో పొటాషియం, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా మార్చి పొడి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల వాటిని ఫేస్ ప్యాక్‌లుగా ఉపయోగించడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

చియాసీడ్స్, అవిసె గింజలు, బాదం, వాల్‌నట్స్ ఇవన్నీ కూడా అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు. వీటిని భోజనం లేదా స్మూతీలలో చేర్చవచ్చు. లెట్యూస్, దోసకాయలు ఆరోగ్యకరమైనవి అయితే, క్యారెట్లు, బ్రోకలీ, బీన్స్, కాయధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను తినడానికి ప్రయత్నించండి.

చాలా మంది వెజిటేబుల్, ప్రూట్ సలాడ్లు తీసుకోవడం వల్ల మాత్రమే మనకు పైబర్ అందుతుందని అనుకుంటారు. కానీ లెట్యూస్ వంటి ఆకుకూరల్లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఫైబర్ అధికంగా ఉండే ఇతర కూరగాయలు, ధాన్యాలు తీసుకోవడం అవసరం.( పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్ నుంచి సేకరించింన వివారాల ఆధారంగా అందించబడినవి.. వీటిని పాటించేందుకు ముందు మీరు కచ్చితంగా వైద్య నిపుణులను సంప్రదించండి)




