Acne: మొటిమలతో విసిగిపోయారా? వీటి బాధ తగ్గాలంటే ఇలా చేయండి..
యుక్తవయసులో మొటిమలు రావడం సర్వ సాధారణం. దీనికి మూలం శరీరంలో హార్మోన్ల మార్పులు. సాధారణంగా మొటిమలు ముఖం మీదేకాకుండా వీపు, ఛాతీ, భుజాల మీదా కూడా వస్తుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. రోజుకు రెండు సార్లు తప్పనిసరిగా ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మంపై జిడ్డు తగ్గి, మృతకణాలు తొలగిపోతాయి. అలాగని ఎక్కువసార్లు ముఖం కడుక్కుంటే లేనిపోని చిక్కులు వెంటాడుతాయి..