- Telugu News Photo Gallery Clean your floors with these tips to keep them sparkling, Check Here is details in Telugu
Cleaning Tips: ఫ్లోరింగ్స్‌ని ఈ టిప్స్‌తో క్లీన్ చేస్తే.. తళుక్కుమని మెరుస్తాయ్!
ఇంటిని ప్రతి రోజనూ తుడుస్తూ, శుభ్రంగా ఉంచుతారం. ఎలా లేదన్నా ఇంట్లోని ఫ్లోర్‌పై మరకలు పడుతూనే ఉంటాయి. కొన్ని మొండి మరకలు ఒక పట్టాన వదలవు. ఎంత తుడిచినా ఆ మరకలు పోవు. అలాగే ఇంట్లోని ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఫ్లోరింగ్ క్లీన్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి. ఫ్లోర్ అద్దంలా మెరిసి పోతుంది. ఇంటిని తుడిచేటప్పుడు ఎప్పుడైనా గోరు వెచ్చటి నీటిని ఉపయోగించండి. అప్పుడు ఇంట్లో ఉండే మురికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా..
Updated on: Apr 17, 2024 | 10:44 AM

ఇంటిని ప్రతి రోజనూ తుడుస్తూ, శుభ్రంగా ఉంచుతారం. ఎలా లేదన్నా ఇంట్లోని ఫ్లోర్‌పై మరకలు పడుతూనే ఉంటాయి. కొన్ని మొండి మరకలు ఒక పట్టాన వదలవు. ఎంత తుడిచినా ఆ మరకలు పోవు. అలాగే ఇంట్లోని ఒక్కోసారి దుర్వాసన వస్తూ ఉంటుంది. అయితే ఈసారి ఫ్లోరింగ్ క్లీన్ చేసేటప్పుడు ఈ చిట్కాలు పాటించండి. ఫ్లోర్ అద్దంలా మెరిసి పోతుంది.

ఇంటిని తుడిచేటప్పుడు ఎప్పుడైనా గోరు వెచ్చటి నీటిని ఉపయోగించండి. అప్పుడు ఇంట్లో ఉండే మురికి ఈజీగా వచ్చేస్తుంది. ఈ గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా వైట్ వెనిగర్, బేకింగ్ సోడా, డిష్ సోప్ కలపండి. వీటిని ఫ్లోర్ తుడిస్తే.. దుర్వాసన పోవడమే కాకుండా.. చాలా నీటిగా ఉంటుంది.

లామినేట్ ఫోర్ అయితే.. మరింత జాగ్రత్తగా శుభ్రం చేయాలి. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా వైట్ వెనిగర్, ఓ నాలుగు లేదా ఐదు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి.. ఫ్లోర్‌ని తుడిస్తే చాలా అందంగా ఉంటుంది.

అదే విధంగా చెక్క ఫ్లోర్ అయితే.. గీతలు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఫ్లోర్‌ని క్లీన్ చేయండి. దీని వల్ల ఫ్లోర్ పాలిష్ కూడా అవుతుంది.

అదే మొజాయిన్ నేల అయితే.. గోరు వెచ్చటి నీటిలో రబ్బింగ్ ఆల్కహాల్, డిష్ వాష్ సోప్ వేసి బాగా మిక్స్ చేసి.. శుభ్రం చేయండి. అదే విధంగా మార్పుల్ ఫ్లోరింగ్‌పై అస్సలు కెమికల్స్ కలిపిన క్లీనర్స్ ఉపయోగించకూడదు. గోరు వెచ్చటి నీటిలో రబ్బింగ్ ఆల్కహాల్, మైల్డ్ లిక్విడ్ డిష్ వాస్ సోప్ కలపండి.




