Sugar In Diabetes: డయాబెటిస్ పేషెంట్లకు కూడా షుగర్ అవసరమే.. రోజూ ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే..
డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో చక్కెర లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లకు కూడా చక్కెర తగు పరిమాణంలో తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. చక్కెరలో సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ శరీరానికి అవసరం. రోజూ కొంచెం స్వీట్ తింటే షుగర్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మధుమేహం అభివృద్ధి చెందడానికి షుగర్ మాత్రమే కాదు.. అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి..
Updated on: Feb 12, 2024 | 8:09 PM

డయాబెటిస్‌తో బాధపడేవారు రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవడానికి ఆహారంలో చక్కెర లేకుండా జాగ్రత్త పడుతుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లకు కూడా చక్కెర తగు పరిమాణంలో తీసుకోవడం శరీరానికి చాలా అవసరం. చక్కెరలో సల్ఫర్ ఉంటుంది. ఈ సల్ఫర్ శరీరానికి అవసరం. రోజూ కొంచెం స్వీట్ తింటే షుగర్ పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ మధుమేహం అభివృద్ధి చెందడానికి షుగర్ మాత్రమే కాదు.. అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.

అధిక సల్ఫర్ కూడా శరీరానికి హానికరం. స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల వాపు సమస్య పెరుగుతుంది. క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో చక్కెర కూడా మధుమేహానికి అవసరమే.

చక్కెరను తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. రోజువారీ చక్కెర తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. అయితే ప్రతిరోజూ ఎంత మోతాదులో చక్కెర తినాలో ఇక్కడ తెలుసుకోండి..

ఒక రోజులో 1-2 టీస్పూన్ల కంటే ఎక్కువ చక్కెరను తినకూడదు. వంటలు లేదా కూరల్లో చక్కెరను అదనంగా చేర్చకూడదు. చాలామంది టీ, పాలల్లో పంచదార కలిపి తాగుతుంటారు. ఈ అలవాటును మానుకోవాలి. రోజూ రాత్రి స్వీట్లు తిన్న తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటే వెంటనే దీని నుంచి బయటపడాలి.

అయితే మధుమేహం ఉన్నవారు షుగర్‌కు దూరంగా ఉండటం మంచిది. ఒక రోజు స్వీట్ తింటే, మరుసటి రోజు షుగర్ డిటాక్స్ డైట్‌ని తప్పక అనుసరించాల్సి ఉంటుంది. షుగర్ లెవల్స్ దాటకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం రోజూ వ్యాయామం చేయాలి. వైద్యుడిని సంప్రదించి ఎప్పటి కప్పుడు తగు సూచనలు పాటిస్తూ ఉండాలి.




