- Telugu News Photo Gallery Pomegranate Benefits: Pomegranate juice benefits for your health, Know here
Pomegranate Benefits: కిడ్నీ, గుండె, మెదడు సమస్యలకు ఒకే ఒక్క దివ్యౌషధం.. రోజుకు ఒక్క గ్లాస్ తాగితే చాలు..
చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యంతో ఉన్న ఏ రోగికి అయినా దానిమ్మ మేలు చేస్తుంది. రక్తహీనత, బలహీనతలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజలు లేదా దానిమ్మ రసం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలు, వృద్ధులు దానిమ్మ గింజలు నేరుగా తినలేరు. వారు రోజువారీ ఆహారంలో కనీసం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ ఉండేలా చూసుకోవాలి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది...
Updated on: Feb 12, 2024 | 8:29 PM

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అనారోగ్యంతో ఉన్న ఏ రోగికి అయినా దానిమ్మ మేలు చేస్తుంది. రక్తహీనత, బలహీనతలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. దానిమ్మ గింజలు లేదా దానిమ్మ రసం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలు, వృద్ధులు దానిమ్మ గింజలు నేరుగా తినలేరు. వారు రోజువారీ ఆహారంలో కనీసం ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ ఉండేలా చూసుకోవాలి. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యంగా ఉండటమే కాకుండా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కూడా సహాయపడుతుంది

దానిమ్మ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని వివిధ అధ్యయనాలు నిరూపించాయి. ఇది రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఫలితంగా, గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

శారీరక బలహీనత, రక్తహీనతతో సహా వివిధ సమస్యలకు దానిమ్మ ఇంటి నివారిణిగా ఉపయోగబడుతుంది. అంతేకాకుండా, దానిమ్మలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి దానిమ్మ రోజూ ఆహారంలో తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. దానిమ్మ రసం మూత్రపిండాల్లో కాల్షియం, ఆక్సలేట్లు, ఫాస్ఫేట్ల సాంద్రతను పెంచుతుంది. దానిమ్మ రసాన్ని రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.

ఖాళీ కడుపుతో దానిమ్మ తినకూడదు. దానిమ్మ విత్తనాలు లేదా దానిమ్మ జ్యూస్ ఖాళీ కడుపుతో తినడం వల్ల అసిడిటీతో పాటు వివిధ శారీరక సమస్యలు తలెత్తుతాయి.




