Tooth Cavity Solutions: దంతాల్లో క్యావిటీస్ సమస్యా..? నిద్రకు ముందు ఈ ఒక్కటి చేస్తే తళతళలాడే పళ్లు మీ సొంతం
చాలా మందికి దంతాల్లో బ్యాక్టీరియా, క్రిములు పేరుకుపోతుంటాయి. దీని ఫలితంగా దంత క్షయం ఏర్పడుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ క్రమం తప్పకుండా పాటిస్తే మెరిసే, అందమైన దంతాలను మీరూ పొందవచ్చు. ఇందుకోసం ఏమి చేయాలో, ఎలా చేయాలో నిపుణుల మాటల్లో మీకోసం.. ఆహారం తరచుగా దంతాల మధ్య చిక్కుకుపోతుంటుంది.బ్రష్ ఆ ప్రదేశాలకు వెళ్లి శుభ్రం చేయలేదు. ఫలితంగా ఆహారం పేరుకుపోయి, అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని నుండి వ్యాధి వ్యాపిస్తుంది..
Updated on: Feb 12, 2024 | 7:52 PM

చాలా మందికి దంతాల్లో బ్యాక్టీరియా, క్రిములు పేరుకుపోతుంటాయి. దీని ఫలితంగా దంత క్షయం ఏర్పడుతుంది. కొన్ని సింపుల్ టిప్స్ క్రమం తప్పకుండా పాటిస్తే మెరిసే, అందమైన దంతాలను మీరూ పొందవచ్చు. ఇందుకోసం ఏమి చేయాలో, ఎలా చేయాలో నిపుణుల మాటల్లో మీకోసం..

ఆహారం తరచుగా దంతాల మధ్య చిక్కుకుపోతుంటుంది.బ్రష్ ఆ ప్రదేశాలకు వెళ్లి శుభ్రం చేయలేదు. ఫలితంగా ఆహారం పేరుకుపోయి, అక్కడ బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని నుండి వ్యాధి వ్యాపిస్తుంది.

దంత వ్యాధులను నివారించడానికి, దంతాలను జాగ్రత్తగా చూసుకోవడానికి దంతాల మధ్య మురికిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దంతాలను ఎప్పటికప్పుడు 'ఫ్లాస్' కర్రతో శుభ్రం చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఇలా చేయాలి.

అలాగే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం రెండు సార్లు పళ్ళు తోముకోవాలి. దంతాలను బ్రష్ చేసేటప్పుడు, బ్రష్ 45 డిగ్రీల కోణంలో ఉండేలా చూసుకోవాలి. చిగుళ్లలోని అన్ని భాగాలకు బ్రష్ చేరే విధంగా బ్రష్ చేయాలి. బ్రష్‌ను పైకి క్రిందికి కదిలించడం ద్వారా పళ్లు బాగా శుభ్రం అవుతాయి. రాత్రిపూట భోజనం చేశాక చాలా మంది బ్రష్ చేసుకోకుండా నిద్రపోతారు. ఈ అలవాటు మానుకోవాలి.

రాత్రంతా నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది కాబట్టి రాత్రి నిద్రకు ముందు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలి. తిన్న తర్వాత బ్రష్ చేయడం వల్ల బ్యాక్టీరియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రోజుకు రెండుసార్లు పళ్ళు తోముకోవడం చాలా ముఖ్యం. దంతాలు, చిగుళ్ళతోపాటు నాలుకను కూడా శుభ్రంగా చూసుకోవాలి. ఎందుకంటే నాలుకపై కూడా బ్యాక్టీరియా పెరుగుతుంది. అందువల్ల, నాలుకను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.




