- Telugu News Photo Gallery Cinema photos Shruti Marathe reveals Jr. NTR will play double role and she is second heroine in Devara movie
Devara: దేవర మెయిన్ సీక్రేట్ బయటపెట్టిన ఆ హీరోయిన్.. రహస్యాలు బయటపెట్టిన ఆ బ్యూటీ ఎవరో తెలుసా ??
దేవర సినిమాలో ఎన్టీఆర్ కారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా..? ఇలాంటి విషయాలన్నింటిని చాలా గోప్యంగా దాచేసారు కొరటాల శివ. చిన్న అప్‌డేట్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. ఓ హీరోయిన్ వచ్చి దేవర గురించి పెద్ద సీక్రేట్ బయటపెట్టింది. మరి ఎన్టీఆర్ సినిమా రహస్యాలు బయటపెట్టిన ఆ బ్యూటీ ఎవరు..? ఆమెకు సినిమాతో ఏంటి సంబంధం..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఇప్పుడు దేవరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ బాగానే జరుగుతుంది.
Updated on: Feb 12, 2024 | 7:29 PM

దేవర సినిమాలో ఎన్టీఆర్ కారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారా..? ఇలాంటి విషయాలన్నింటిని చాలా గోప్యంగా దాచేసారు కొరటాల శివ. చిన్న అప్‌డేట్ కోసమే ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. ఓ హీరోయిన్ వచ్చి దేవర గురించి పెద్ద సీక్రేట్ బయటపెట్టింది. మరి ఎన్టీఆర్ సినిమా రహస్యాలు బయటపెట్టిన ఆ బ్యూటీ ఎవరు..? ఆమెకు సినిమాతో ఏంటి సంబంధం..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

జూనియర్ ఎన్టీఆర్ ఫోకస్ అంతా ఇప్పుడు దేవరపైనే ఉంది. ఈ చిత్ర షూటింగ్ బాగానే జరుగుతుంది. అయితే ఎప్రిల్ 5 నుంచి వాయిదా పడటంతో.. కాస్త ఆలస్యమైనా పర్ఫెక్ట్ ఔట్ పుట్‌తో రావాలని చూస్తున్నారు మేకర్స్. ఈ మధ్యే కీలక షెడ్యూల్స్ పూర్తి చేసారు కొరటాల. కొత్త రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతూనే ఉంది.

దేవరలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈమెతో పాటు మరాఠీ భామ శృతి మరాఠేను ఇందులో మరో హీరోయిన్‌గా ఎంపిక చేసారు. ఇప్పుడు ఈమె కారణంగా సినిమాలోని మెయిన్ సీక్రేట్ బయటపడింది. ఇన్నాళ్లూ దేవరలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నారా లేదా అనేదానిపై క్లారిటీ లేదు.. కానీ ఇప్పుడు వచ్చేసింది. గతంలో ఆంధ్రావాలా, అదుర్స్, జై లవకుశలో ఒకటి కంటే ఎక్కువ రోల్స్ చేసారు.

దేవరలో ఎన్టీఆర్ రెండు కారెక్టర్స్ చేస్తున్నారని.. అందులో ఒక తారక్‌కు జోడీగా తాను నటిస్తున్నట్లు తెలిపారు శృతి మరాఠే. ఈమె చెప్పిన దాన్నిబట్టి చూస్తుంటే దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం ఖరారైనట్లే. పార్ట్ 1లో ఒకరి కథ.. రెండో భాగంలో ఇంకొకరి కథ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. ఆగస్ట్ 15న దేవర పార్ట్ 1 విడుదల ప్లాన్ చేస్తున్నా.. ఆ రోజు పుష్ప 2 ఉండటంతో మరో తేదీ కోసం చూస్తున్నారు మేకర్స్.

శృతి మరాఠే మాత్రమే కాదు.. ఈ మధ్య ఊర్వశి రౌతెలా సైతం బాలయ్య సినిమా గురించి సీక్రేట్స్ బయటపెట్టారు. బాబీ దర్శకత్వంలో NBK నటిస్తున్న సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నానని తెలిపారు ఊర్వశి. టీమ్ చెప్పకముందే.. బాలయ్య సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించారు ఈ భామ. మొత్తానికి ఆడవాళ్ల నోట్లో రహస్యం దాగదనే మాట ఈ హీరోయిన్లను చూస్తుంటే అర్థమవుతుంది.




