Potato Storage Tips: మీరూ ఉడికించిన బంగాళదుంపలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా
పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాల్లో బంగాళదుంప ముఖ్యమైనవి. చిరుతిళ్ల నుంచి కూరల వరకు అన్నింటిలోనూ బంగాళదుంపలను ఉపయోగిస్తారు. అలాగూ బంగాళాదుంపలను ఉడకబెట్టి పరాటా కూడా తయారు చేస్తారు. అయితే అదే రోజువారి వంటల్లో బంగాళ దుపంపలను వినియోగించేవారు వాటిని రోజూ ఉడికించే పని లేకుండా ఒకేసారి ఎక్కువ మోతాదులో ఉడికించి ఫ్రిజ్‌లలో దాస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉడికించిన బంగాళాదుంపలను ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల, అందులో ఉండే స్టార్చ్ చక్కెరగా..

పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాల్లో బంగాళదుంప ముఖ్యమైనవి. చిరుతిళ్ల నుంచి కూరల వరకు అన్నింటిలోనూ బంగాళదుంపలను ఉపయోగిస్తారు. అలాగూ బంగాళాదుంపలను ఉడకబెట్టి పరాటా కూడా తయారు చేస్తారు. అయితే అదే రోజువారి వంటల్లో బంగాళ దుపంపలను వినియోగించేవారు వాటిని రోజూ ఉడికించే పని లేకుండా ఒకేసారి ఎక్కువ మోతాదులో ఉడికించి ఫ్రిజ్‌లలో దాస్తుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉడికించిన బంగాళాదుంపలను ఫ్రీజర్‌లో ఉంచడం వల్ల, అందులో ఉండే స్టార్చ్ చక్కెరగా మారుతుందట.
బంగాళదుంపలను ముందుగా ఉడకబెట్టి, వాటిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, మరుసటి రోజు ఉపయోగించే వారు చాలా మంది ఉన్నారు. కానీ ఇలా ఫ్రిజల్ నిల్వ ఉంచిన ఉడికించిన బంగాళదుంపలు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఇక ఈ బంగాళాదుంపలను వేయించినట్లయితే వీటిల్లో ఉండే అమైనో ఆమ్లాలు మార్పుచెందుతాయి. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం. రిఫ్రిజిరేటర్‌లో కేవలం ఉడికించిన బంగాళాదుంపలకు మాత్రమే కాదు పచ్చి బంగాళాదుంపలను కూడా ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల బంగాళదుంపలు పాడవుతాయి. బంగాళాదుంపలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన తర్వాత, అందులో ఉండే చక్కెర బంగాళాదుంపలో ఉండే అమినో యాసిడ్ ఆస్పరాజైన్‌తో కలిసి యాక్రిలామైడ్ రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. పేపర్, ప్లాస్టిక్ తయారీలో ఈ రసాయనాన్ని ఉపయోగిస్తారు. అందువల్ల బంగాళదుంపలను ఫ్రిజ్‌లో ఉంచే అలవాటు మీకు కూడా ఉంటే వెంటనే ఈ రోజు నుంచి ఆ అలవాటును మార్చుకోండి.
మరైతే బంగాళాదుంపలను ఎలా నిల్వ చేయాలి?
బంగాళాదుంపలను నిల్వ చేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. బంగాళాదుంపలను ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, వాటిని సూర్యకాంతికి దూరంగా ఉంచాలి. బంగాళాదుంపలను ఒకదానిపై ఒకటి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల కింద ఉంచిన బంగాళదుంపలు పాడైపోతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగాళాదుంపలను కనీసం 50 F అంటే 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం ఉత్తమమైన మార్గం.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.