Andhra Pradesh: జాలరుల వలకు చిక్కిన అరుదైన చేప.. ధరెంతో తెలుసా?

సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి వలకు అరుదైన చేప చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుల వలకు గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం (నవంబర్‌ 27) సముద్రంలో చిక్కింది. భారీ సైజులో ఉన్న ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు ఎగబడ్డారు. చేప విక్రయానికి నిర్వహించిన వేలం పాటలో పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య ఏకంగా రూ.3.90 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేప బరువు..

Andhra Pradesh: జాలరుల వలకు చిక్కిన అరుదైన చేప.. ధరెంతో తెలుసా?
Kachidi Fish
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 28, 2023 | 8:44 AM

అనకాపల్లి, నవంబర్‌ 28: సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి వలకు అరుదైన చేప చిక్కింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారుల వలకు గోల్డెన్‌ ఫిష్‌గా పిలిచే అరుదైన కచిడి చేప సోమవారం (నవంబర్‌ 27) సముద్రంలో చిక్కింది. భారీ సైజులో ఉన్న ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు ఎగబడ్డారు. చేప విక్రయానికి నిర్వహించిన వేలం పాటలో పూడిమడకకు చెందిన వ్యాపారి మేరుగు కొండయ్య ఏకంగా రూ.3.90 లక్షలు చెల్లించి కొనుగోలు చేశాడు. ఈ చేప బరువు దాదాపు 27 కేజీల వరకు తూగిందని మత్స్యకారుడు మేరుగు నూకయ్య తెలిపారు.

కాగా కచిడి చేప ఎప్పుడు దొరికిన భారీ మొత్తంలో అమ్ముడు పోతుంది. అందుకు ఈ ప్రత్యేక చేపలోని విశేష ఔషధ గుణాలే కారణం. ఈ చేప తింటే పలు రోగాలు నయం అవుతాయని స్థానికులు చెబుతున్నారు. ఆసుపత్రుల్లో ఆపరేషన్‌ నిర్వహించిన తర్వాత కుట్లు వేసే దారాన్ని ఈ చేప గాల్‌ బ్లాడర్‌తో తయారు చేస్తారని, మందుల తయారీలోనూ ఈ చేప భాగాలను ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు. ఇలాంటి చేపలు అరుదుగా మాత్రమే దొరుకుతుంటాయని వాళ్లు చెబుతున్నారు.

ఈ ముర్రాజాతి గేదె ధర రూ.4.60 లక్షలు..

హరియాణాలోని ఝజ్జర్‌ జిల్లా ఖాన్‌పుర్‌కు చెందిన ఓ ముర్రాజాతి గేదె రికార్డు ధరకు అమ్ముడు పోయింది. గేదె యజమాని యజమాని రణవీర్‌ షియోరాన్‌ దాదాపు రూ.4.60 లక్షలకు గేదెను అమ్మాడు. భారీ ధర పలికినందుకు గేదె యజమాని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో నోట్లతో తయారు చేసిన మాలను గేదెకు వేసి దానికి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఈ ముర్రాజాతి గేదె రోజుకి 26 లీటర్ల పాలు ఇస్తుందని యజమాని రణవీర్‌ షియోరాన్‌ తెలిపాడు. వారి గ్రామానికి చెందిన వికాస్‌ అనే వ్యక్తి వద్ద గతంలో రూ.78 వేలకు ఈ గేదెను కొనుగోలు చేశానని అన్నాడు. గేదె పోషణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపాడు. రోజు దానికి ఇచ్చే ఆహారం నుంచి సంరక్షణ వరకు ఎంతో జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ గేదె వయసు ఆరేళ్లని, అదే గ్రామానికి చెందిన మల్వీంద్ర అనే వ్యక్తి ఈ గేదెను రూ.4.60 లక్షలకు కొనుగోలు చేశాడని యజమాని రణవీర్‌ షియోరాన్‌ చెప్పుకొచ్చాడు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అత్యంత ఖరీదైన గేదె ఇదేనంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..