AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై..

వీధి కుక్కలా.. వేట మృగాలా?.. చిన్నారిపై దాడి చేసిన ఈకుక్క తీరును చూస్తే.. కసిపెంచున్న అడవి మృగం కన్నా దారుణంగా ఉంది. ఇది విశ్వాసం గల జంతువుకాదు.. వన్యమృగమనిపిస్తుంది. చిన్నారిపై దాడి చేయడమే కాకుండా.. నోట కరుచుకుని చాలా దూరం లాక్కెళ్లింది. మళ్లీ మళ్లీ బాలుడిపై విరుచుకుపడి.. ఒళ్లంతా రక్తసిక్తం చేసింది. ఈ కుక్క దాడి చేసిన టైంలో ఆ పిల్లాడు విలవిల్లాడిపోతూ.. ఆర్తనాదాలు చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Hyderabad: రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. హైదరాబాద్‌లో దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై..
Stray Dogs
Shaik Madar Saheb
|

Updated on: Nov 28, 2023 | 9:00 AM

Share

వీధి కుక్కలా.. వేట మృగాలా?.. చిన్నారిపై దాడి చేసిన ఈకుక్క తీరును చూస్తే.. కసిపెంచున్న అడవి మృగం కన్నా దారుణంగా ఉంది. ఇది విశ్వాసం గల జంతువుకాదు.. వన్యమృగమనిపిస్తుంది. చిన్నారిపై దాడి చేయడమే కాకుండా.. నోట కరుచుకుని చాలా దూరం లాక్కెళ్లింది. మళ్లీ మళ్లీ బాలుడిపై విరుచుకుపడి.. ఒళ్లంతా రక్తసిక్తం చేసింది. ఈ కుక్క దాడి చేసిన టైంలో ఆ పిల్లాడు విలవిల్లాడిపోతూ.. ఆర్తనాదాలు చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్.. సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

మీపిల్లలను ఒంటరిగా బయటకు పంపుతున్నారా? అయితే హైదరాబాద్‌లో వీధి కుక్కలతో జరభద్రం. చచ్చేది బ్రతేకేది తెలియకుండా చిన్నారులపై దాడి చేస్తున్నాయి. చిన్నారిపై వీధి కుక్క దాడి చూశాక.. ఈ కుక్కను విశ్వాసం గల్ల జంతువంటే ముమ్మాటికి తప్పే అవుతుంది. అవి ప్రవర్తించే తీరు దారుణాతి దారుణంగా ఉంది. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌- ఎన్‌ఎంగూడలో వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఆరేళ్ల చిన్నారి లేత చర్మం చిధ్రం చేసింది. చిన్నారి పరిస్థితి చూస్తుంటే గుండెలు చివుక్కుమంటున్నాయి.చిన్నారిపై దాడిచేసిన.. శరీరంపై కుక్కగాట్లు చూస్తే కన్నీళ్లు రాకమానవు. కుక్క దాడిలో గాయపడ్డబాలుడి పరిస్తితి విషమంగా ఉంది. తీవ్రగాయాలైన బాలుడి చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్ లో చిన్నారిపై కుక్క దాడి..

ఏపీలోని కడపలో..

అటు కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని ఆంజనేయనగర్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంటివద్ద ఆడుకుంటున్న హన్వేష్ భగవత్‌ అనే నాలుగేళ్ల పిల్లాడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడిచేసింది. స్థానికులు గమనించి తరమడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిత్యం ఎక్కడో ఒకచోట కుక్కలు దాడులు జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

తెలుగు రాష్ట్రాలను మరోసారి వీధి కుక్కలు వణికిస్తున్నాయి. బద్వేల్‌లో జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పిల్లాడి తండ్రి.. జిల్లా కలెక్టర్‌, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వఅధికారుల తీరును ఎండగడుతూ సోషల్‌మీడియాలో తన ఆవేదనను పోస్ట్ చేశాడు చిన్నారి తండ్రి. ఇప్పటికైనా అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే లేతప్రాణాలు గాల్లో కలుస్తాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..