CM KCR face on London streets: ఎల్లలు దాటిన అభిమానం.. లండన్ వీధుల్లో సైకిల్ తొక్కి సీఎం కేసీఆర్ ముఖచిత్రం రూపకల్పన
అభిమానానికి హద్దులు ఉండటని మరోమారు రుజువు చేశాడు ఈ కుర్రాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. లండన్‌కు చెందిన తెలంగాణ సైకిలిస్ట్ బీరం మల్లారెడ్డి అనే యువకుడు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ముఖ చిత్రాన్ని లండన్ నగరంలో వినూత్నంగా చిత్రీకరించాడు. అందుకు లండన్ వీధుల్లో 6 గంటల కంటే తక్కువ సమయంలో సుమారు 88 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే..
హైదరాబాద్, నవంబర్ 28: అభిమానానికి హద్దులు ఉండటని మరోమారు రుజువు చేశాడు ఈ కుర్రాడు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. లండన్‌కు చెందిన తెలంగాణ సైకిలిస్ట్ బీరం మల్లారెడ్డి అనే యువకుడు బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు ముఖ చిత్రాన్ని లండన్ నగరంలో వినూత్నంగా చిత్రీకరించాడు. అందుకు లండన్ వీధుల్లో 6 గంటల కంటే తక్కువ సమయంలో సుమారు 88 కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణించాడు. ఇందులో విశేషం ఏముంది అని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..
మనోడు ప్రయాణించిన రోడ్డు మార్గాలన్నింటినీ కలిపితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ చిత్రం వచ్చింది. కేసీఆర్ రైడ్ పేరిట అతను రోడ్లపై సైకిల్ తొక్కుతున్న సమయంలో గూగుల్ రూట్ మ్యాప్ వినియోగించాడు. అందుకు ముందుగా సెలక్ట్ చేసుకున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ సైకిల్ తొక్కాడు. అంతాపూర్తయిన తర్వాత అతను ప్రయాణించిన మార్గాన్ని గూగుల్ మ్యాపింగ్ చేశాడు. ఇలా అన్ని మార్గాలను కలుపగా అచ్చంగా కేసీఆర్ స్కెచ్ వచ్చింది. కేసీఆర్‌పై తనకున్న అభిమానాన్ని మల్లారెడ్డి ఇలా వినూత్నంగా చాటడం ప్రతి ఒక్కరినీ అబ్బురపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్‌ఎస్ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. మీరు చూడండి..
Pedaling Admiration!
London-based Cyclist Mr. Malla Reddy Beeram expresses his admiration for CM Sri KCR for achieving statehood for Telangana and its unmatched development.#KCROnceAgain #VoteForCar pic.twitter.com/CxdrV3A4Dc
— BRS Party (@BRSparty) November 27, 2023
కాగా తెలంగాణలో నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రచారం కార్యక్రమాల్లో ఆయా రాజకీయ నేతలు ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు నేడు చివరి రోజు కావడంతో ఆకరి నిమిషం వరకు నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక పోలింగ్ అనంతరం డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.
మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.