Telangana Elections: తెలంగాణలో డబ్బుల ప్రవాహం.. సోమవారం ఒక్క రోజే ఎన్ని కోట్లు పట్టుకున్నారంటే?
ఈ రోజు సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో నేతల దృష్టంతా పోల్ మేనేజ్‌మెంట్ పై పడింది. డబ్బులు ప్రవాహం విచ్చలవిడిగా సాగుతోంది. అలాగే మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల అధికారులు ఎంతలా నిఘా పెట్టినా కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 4 నుంచి 5 వేల వరకూ పంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో సోమవారం
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి మంగళవారం (నవంబర్ 28) ఆఖరు రోజు. సాయంత్రం 5 తర్వాత మైక్‌లు బంద్ కానున్నాయి. దీంతో అన్ని పార్టీల అగ్ర నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ 2 సభల్లో పాల్గొంటుంటే.. కాంగ్రెస్‌లో ప్రియాంక, రాహుల్ సహా ముఖ్యనేతలు జిల్లాలను చుట్టేస్తున్నారు. ఇక బీజేపీ తరపున జాతీయనేతలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఈ రోజు సాయంత్రానికి ప్రచారం ముగియనుండడంతో నేతల దృష్టంతా పోల్ మేనేజ్‌మెంట్ పై పడింది. డబ్బులు ప్రవాహం విచ్చలవిడిగా సాగుతోంది. అలాగే మద్యం ఏరులై పారుతోంది. ఎన్నికల అధికారులు ఎంతలా నిఘా పెట్టినా కొన్ని నియోజకవర్గాల్లో ఓటుకు 4 నుంచి 5 వేల వరకూ పంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో సోమవారం (నవంబర్ 27) ఒక్కరోజే 14 కోట్ల 43 లక్షలు సీజ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు రూ.9,63,34,880 నగదు, రూ.4,27,88,147 విలువైన మద్యం, రూ.5,96,250 విలువైన మత్తుమందులు, రూ.46,25,000 విలువైన చీరలు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సొమ్ముతో కలిపి అక్టోబరు 9వ తేదీ నుంచి ఇప్పటి వరకు పట్టుబడ్డ మొత్తం రూ.724,00,46,454కు చేరినట్లు ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.
ఎన్నికల అధికారులతో సీఈఓ వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సీఈఓ వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ నిర్వహణ, ఓటర్ గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లపై చర్చించారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు తిరిగి వెళ్లేలా చూడాలని, అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..