- Telugu News Lifestyle Do you eat while sitting on the bed? Do you know how dangerous it is? check here is details
Interesting Facts: మంచం మీద కూర్చుని తింటున్నారా.. ఎంత డేంజరో తెలుసా!
ఎప్పుడైనా మంచం మీద కూర్చుని తింటే.. ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటారు. మంచం మీద, బెడ్ రూమ్ లో కూర్చుని అస్సలు తినవద్దని చెబుతూ ఉంటారు. కానీ కొంత మంది అస్సలు పట్టించుకోకుండా.. బెడ్ మీదనే కూర్చుని తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రమాదంలో పడతారన్న విషయం మీకు తెలుసా. సాధారణంగా ఎవరి ఇళ్లలో అయినా బొద్దింకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కిచెన్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని వదిలించుకుందామన్నా..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 29, 2023 | 9:47 PM

ఎప్పుడైనా మంచం మీద కూర్చుని తింటే.. ఇంట్లో వాళ్లు తిడుతూ ఉంటారు. మంచం మీద, బెడ్ రూమ్ లో కూర్చుని అస్సలు తినవద్దని చెబుతూ ఉంటారు. కానీ కొంత మంది అస్సలు పట్టించుకోకుండా.. బెడ్ మీదనే కూర్చుని తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీరు ప్రమాదంలో పడతారన్న విషయం మీకు తెలుసా. సాధారణంగా ఎవరి ఇళ్లలో అయినా బొద్దింకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి.

ముఖ్యంగా కిచెన్ లో ఇవి ఎక్కువగా ఉంటాయి. వీటిని వదిలించుకుందామన్నా.. అంత త్వరగా పోవు. ఎక్కడ ఆహారం ఉంటే అక్కడే తిరుగుతూ ఉంటాయి. ఒక్కాసారి ఒక్క బొద్దింక ఇంట్లో కనిపించిందంటే.. ఆ తర్వాత వరుస పెట్టి మరీ క్యూ కడుతూ ఉంటాయి.

బొద్దింకలకు.. బెడ్ మీద కూర్చుని తినడానికి లింక్ ఏంటి? అనుకుంటున్నారా. అసలు మ్యాటర్ ఇక్కడే ఉంది. సాధారణంగా బెడ్ మీద కూర్చుని ఎలాంటి ఆహారం తిన్నా.. అవి మంచం చుట్టు పక్కల లేదా బెడ్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఎంత శుభ్రం చేసినా.. ఏదో ఒక చోట ఆహారం పడి ఉంటుంది. ఈ ఆహారం కోసం.. బొద్దింకలు అక్కడికి క్యూ కడతాయి. అంతేనా అనుకునేరు.

సాధారణంగా రాత్రి పడకునేటప్పుడు చెవుల్లో శరీరం జిగురును స్రవిస్తూ ఉంటాయి. ఈ జిగురుకు.. బొద్దింకలు ఆకర్షితమవుతాయి. అలా నెమ్మదిగా ఈ బొద్దింకలు చెవిలోకి దూరతాయి. దీంతో చెవుల్లో ఇన్ ఫెక్షన్స్ సోకే ప్రమాదం. ఉంది. అప్పుడప్పుడు చెవుల్లో బొద్దింకలు దూరినట్టు.. సోషల్ మీడియాలో కూడా పలు వీడియోలను చూస్తూనే ఉంటారు.

ఇలా వీటికి ప్రధాన కారణం పరిశుభ్రత లేకపోవడమే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వీలైనంత వరకూ బెడ్ రూమ్ లో కానీ బెడ్ పై ఆహారం తినకపోవడమే బెటర్. ఎప్పటికప్పుడు మీరు నిద్రిస్తున్న ప్రదేశాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే నిద్రిస్తున్నప్పుడు చెవుల్లో కాటన్ బాల్స్ పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.





























