IB Recruitment 2023: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఏదైనా డిగ్రీ అర్హత
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు..
న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 995 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-2/ఎగ్జిక్యూటివ్ పోస్టులు 995 ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో 377 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 129 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 222 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 134 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 133 పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు డిసెంబర్ 15, 2023 నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 15వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.550 చెల్లించాలి. టైర్-1 రాత పరీక్ష, టైర్-2 పరీక్ష, టైర్-3/ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.44,900 నుంచి 1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో.. అనంతపురం, చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు.
రాత పరీక్ష విధానం
టైర్-1 రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-2 పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. టైర్-1 పరీక్షలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్/లాజికల్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక టైర్-2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్, ప్రెసిస్ రైటింగ్ ఉంటుంది. మొత్తం 50 మార్కులు ఈ పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి ఒక గంట కేటాయిస్తారు. టైర్-3 కింద 100 మార్కులతో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ముఖ్యమైన తేదీలు…
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: నంబర్ 25, 2023.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2023.
- దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్ 19, 2023.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి వివరాలు అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.