సల్ఫేట్ లేని షాంపూ ఉపయోగించాలి. షాంపూ చాలా ఆల్కలీన్‌గా ఉంటే, జుట్టు రంగు, తేమ రెండూ పోతాయి. షాంపూతో పాటు, హెయిర్ కండీషనర్, హెయిర్ మాస్క్ ఉపయోగించాలి. ఇది జుట్టు రంగును మన్నికైనదిగా చేస్తుంది. రంగు వేసిన జుట్టు మీద స్ట్రెయిట్‌నర్‌లు, డ్రైయర్‌లు, కర్లర్‌లను ఉపయోగించ కూడదు. వెంట్రుకలను తరచూ వేడి చేయడం వల్ల రంగు తీవ్రత తగ్గి, జుట్టు డల్ గా మారుతుంది.