AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padmasana Benefits: ఒత్తిడి, ఆందోళ‌నతో బాధపడుతున్నారా.. అయితే ఈ ప‌ద్మాస‌నం మీకు ఒక వరం..

మారుతోన్న టెక్నాల‌జీకి, కాలానికి అనుగుణంగా మ‌నిషి జీవ‌న విధానంలోమార్పులు వ‌చ్చాయి. శారీర‌క శ్రమ పూర్తిగా తగ్గడం, మాన‌సిక శ్రమ పెర‌గ‌డం కార‌ణంగా నిత్యం ఒత్తిళ్ల పొత్తిళ్లలో సావాసం చేయాల్సి వ‌స్తుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌, వెన్నముక నొప్పితో బాధ‌ప‌డేవారికి ప‌ద్మాస‌నం మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. మ‌రి ప‌ద్మాసనం ఎలా వేయాలి.? దీని వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలు ఏంట‌న్నవి ఓసారి తెలుసుకుందాం..

Prudvi Battula

|

Updated on: Jun 07, 2023 | 12:22 PM

మారుతోన్న టెక్నాల‌జీకి, కాలానికి అనుగుణంగా మ‌నిషి జీవ‌న విధానంలోమార్పులు వ‌చ్చాయి. శారీర‌క శ్రమ పూర్తిగా తగ్గడం, మాన‌సిక శ్రమ పెర‌గ‌డం కార‌ణంగా నిత్యం ఒత్తిళ్ల పొత్తిళ్లలో సావాసం చేయాల్సి వ‌స్తుంది.

1 / 6
ఇక గంట‌ల త‌రబ‌డి కంప్యూట‌ర్ల ముందు కూర్చొని చేసే ప‌నితో మెడ‌, న‌డుము నొప్పితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చొవ‌డం వ‌ల్ల శారీర‌క స‌మ‌స్యల‌తో పాటు మాన‌సిక స‌మ‌స్యలు కూడా చుట్టుముట్టుతున్నాయి.

2 / 6
అయితే ఆస‌నాల ద్వారా మ‌న‌కు వ‌చ్చే ప్రతీ జ‌బ్బును త‌రిమికొట్టవ‌చ్చనే విష‌యం మీకు తెలుసా.? ఒత్తిడి, ఆందోళ‌న‌, వెన్నముక నొప్పితో బాధ‌ప‌డేవారికి ప‌ద్మాస‌నం మంచి ఔష‌ధంలా ప‌నిచేస్తుంది. మ‌రి ప‌ద్మాసనం ఎలా వేయాలి.? దీని వ‌ల్ల క‌లిగే ప్రయోజ‌నాలు ఏంట‌న్నవి ఓసారి తెలుసుకుందాం..

3 / 6
ప‌ద్మాస‌నాన్ని నిత్యం క్ర‌మంత‌ప్పకుండా చేస్తే తొడ‌ల‌లో ఉండే అద‌న‌పు కొవ్వు క‌రుగుతుంది. ప‌ద్మాసం వేసే స‌మ‌యంలో ప్రశాంతంగా క‌ళ్లు మూసుకొని శ్వాస‌పై ధ్యాస కేంద్రీక‌రిస్తే మాన‌సిక ప్రశాంత‌త‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

4 / 6
రోజంతా కూర్చొని ప‌నిచేసే వారికి వెన్నెముక నొప్పి క‌లుగుతుంది. అలాంటి వారి ఈ ఆస‌నాన్ని ప్రయ‌త్నిస్తే వెన్నెముక ధృడంగా మారుతుంది.  మెడ నొప్పి, కండ‌రాల నొప్పుల‌ను కూడా ఈ ఆసనంతో చెక్ పెట్టొచ్చు.

5 / 6
ప‌ద్మాస‌నం ఎలా వేయాలంటే.. ముందుగా రెండు కాళ్లను ముందుకు చాపి నేల‌పై కూర్చోవాలి. అనంత‌రం మొద‌ట కుడికాలిపాదం ఎడ‌మకాలి తొడ‌పై, అలాగే ఎడ‌మ కాలి పాదాన్ని కుడి కాలి తొడ‌పై ఉంచి కూర్చోవాలి. అనంత‌రం రెండు చేతుల‌ను కాళ్లపై ఉంచి న‌డుమును నిటారుగా చేసి క‌ళ్లు మూసుకొని శ్వాస‌పై ఏకాగ్రత‌, దృష్టిని నిల‌పాలి. ఎంత‌సేపు చేయ‌గ‌లిగితే అంత‌సేపు చేసి త‌ర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇలా క్ర‌మం త‌ప్పకుండా చేస్తే మంచి ఫ‌లితాలు ల‌భిస్తాయి.

6 / 6
Follow us