AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Drumsticks: ఈ చెట్టు ఆయుర్వేదంలో దివ్యౌషధం.. డజన్ల కొద్దీ రోగాలకు తిరుగులేని రామబాణం..!

మునగలో ఉండే పోషకాలు నమ్మశక్యం కానివి.. తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు! చాలామంది సాంబార్ కోసం మాత్రమే మునగ కాయల్ని ఉపయోగిస్తారు. కానీ, ఒకసారి మునగ కాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు దానిని మీ అన్ని కూరగాయలతో పాటుగా ప్రతి రోజూ వండుకుని తింటారు. అవును. మునగ అద్భుతమైన పోషకాల నిధి అంటున్నారు ఆయుర్వేదా ఆరోగ్య నిపుణులు. మునగను క్రమం తప్పకుండా తినడం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం...

Jyothi Gadda
|

Updated on: Aug 10, 2025 | 12:59 PM

Share
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి ఇది దివ్యౌషధంగా చెబుతారు.. మీ చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే మీరు మీ ఆహారంలో మునగను తప్పక చేర్చుకోవాలి. శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే పిత్తాశయం పనితీరును ప్రోత్సహించడంలో మునగ ఎంతగానో సహాయపడుతుంది. మునగతో డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు అంటున్నారు.

1 / 5
మునగలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇది దగ్గు, జలుబు వంటి కాలానుగుణ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.  మునగ ఎముక సాంద్రతను మెరుగుపరుస్తుంది. మునగకాయలో బలమైన ఎముకలకు అవసరమైన కాల్షియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి.

2 / 5
మునగలో అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి. నియాసిన్, రిబోఫ్లేవిన్ మరియు విటమిన్ బి12 వంటి ఇతర బి విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగలో ఉండే మెగ్నీషియం రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది.

3 / 5
మునగ కాయలు తరచూ తినడం వల్ల థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రిస్తుంది. మునగలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.  మునగలో ఉండే పోషకాలు రక్తనాళాలలో చెడు కొలస్ట్రాల్‌ పేరుకుపోకుండా చేస్తాయి. దీన్ని తినడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి.

4 / 5
మునగ చర్మానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ వంటి పలు పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. మొటిమలను తొలగిస్తుంది. యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. కంటి వ్యాధులను కూడా దూరం చేస్తుంది. మునగ సూప్ తీసుకోవటం వల్ల క్రమంగా బరువు తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

5 / 5