AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోదారోళ్ళ స్పెషల్.. పులస చేప ధరే కాదు.. లాభాలూ ఎక్కువే

పులస చేప గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ‘పుస్తెలు అమ్మైనా సరే పులస చేప తినాలని’ అంటారు. ఈ సామెత ఊరికే రాలేదు. ఈ చేప ఖరీదు కూడా ఎక్కువే. ఈ పులస చేప గోదావరి నదిలో మాత్రమే దొరుకుతుంది. పులస చేప కూర ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ఫేమస్ వంటకం. పులస చేప పులుసు ఎంతో రుచిగా ఉంటుంది. ఒక ముక్క పులుసు రెండు వేలు.. మూడు వేలు కూడా పలుకుతుంది. అంత ధర ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కూర రుచి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ చేప తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Prudvi Battula
|

Updated on: Aug 10, 2025 | 12:43 PM

Share
పులస చేపలోని పోషకాలు: పులస చేపలో విటమిన్లు డి, బి12, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫాస్పరస్, సెలీనియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటితో మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం చాల మంచిది అంటున్నారు నిపుణులు 

1 / 5
గుండె ఆరోగ్యం: పులస చేప తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఈ చేపలో మంచి కొవ్వు పదార్థాలు ఉంటాయి. కాబట్టి చెడు కొలెస్ట్రాల్‌ను, రక్త పోటును కంట్రోల్ చేస్తుంది. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పనితీరును కూడా మెరుగు పరిచి, మతి మరుపును తగ్గిస్తుంది.

2 / 5
ప్రోటీన్ మెండుగా: పులస చేపలో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. ప్రోటీన్ శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. కండరాల నిర్మాణానికి కూడా సహాయ పడుతుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.

3 / 5
ఫైబర్: పులసలో ఫైబర్ కంటెంట్ కూడా అధికంగానే లభిస్తుంది. ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం, నొప్పి, మలబద్ధకం సమస్యలు తగ్గుతాయి. దీన్ని వెంటనే మీ  డైట్‎లో యాడ్ చేసుకోండి. 

4 / 5
బరువు తగ్గుతారు: పులస చేప తింటే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి పులస తింటే వెయిట్ లాస్ అవ్వొచ్చు. పులస చేప తినడం వల్ల ఎముకలకు, కీళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

5 / 5