- Telugu News Photo Gallery Ear Pain Tips: How Do You Cure An Ear Pain Or Infection, Know Details Here
Ear Pain: చెవి నొప్పిని నిర్లక్ష్యం చేస్తే వెలకట్టలేని మూల్యం చెల్లిచాలి.. ఈ తప్పులు చేయకండి
జలుబు చేసినప్పుడు చాలా మందికి చెవిలో నొప్పి సంభవిస్తుంది. అయితే ఇలా అన్ని సమయాలలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనేక పెద్ద ప్రమాదాలకు ఇది సంకేతం. చెవి నొప్పిని వదిలించుకోవడానికి, చాలా మంది ఆయుర్వేదం తీసుకుంటారు. లేదా నొప్పి మందులు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు చెవి నొప్పి నయమవుతాయి లేదంటే నొప్పి మరింత తీవ్ర మవుతుంది..
Updated on: Mar 28, 2024 | 1:02 PM

జలుబు చేసినప్పుడు చాలా మందికి చెవిలో నొప్పి సంభవిస్తుంది. అయితే ఇలా అన్ని సమయాలలో ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండండి. అనేక పెద్ద ప్రమాదాలకు ఇది సంకేతం. చెవి నొప్పిని వదిలించుకోవడానికి, చాలా మంది ఆయుర్వేదం తీసుకుంటారు. లేదా నొప్పి మందులు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు చెవి నొప్పి నయమవుతాయి లేదంటే నొప్పి మరింత తీవ్ర మవుతుంది.

చెవి నొప్పి ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే, దానిని నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది తీవ్రమైన వ్యాధులకు ముందస్తు సంకేతం. మీరూ చెవి నొప్పితో బాధపడుతుంటే, నీరు, షాంపూ, సబ్బు నురగ వంటికి చెవిలోకి రాకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు చెవిలో నీరు చేరినా నొప్పి మొదలవుతుంది.

స్నానం చేసేటప్పుడు చెవుల్లో కాటన్ బాల్స్ పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల నీరు చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు గొంతు నొప్పి కారణంగా కూడా చెవినొప్పి మొదలవుతుంది. చెవి నొప్పి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యను నివారించాలంటే ముందుగా జలుబు, దగ్గు సకాలంలో తగ్గించుకోవడానికి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఆ తర్వాత కూడా నొప్పి తీవ్ర అలాగే ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరిన్ని రోజులు ఈ నొప్పిని విస్మరిస్తే చెవుల్లోంచి చీము వచ్చే ప్రమాదం ఉంది. అంతే కాదు చెవిలోంచి చీము రావడంతో పాటు రక్తం కూడా కారడం మొదలవుతుంది.

అటువంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించండి. చెవి లోపల ఇన్ఫెక్షన్ కారణంగా ఇలా జరుగుతుంది. లేదా మరేదైనా గొంతు సమస్య కారణం అయి ఉండవచ్చు.




