- Telugu News Latest Telugu News Can You Eat Roasted Chana And Jaggery Together, Know the benefits here
Roasted Chana: వేయించిన శనగల్లో కాస్తింత బెల్లం వేసుకుని తిన్నారంటే..! కొన్ని రోజుల్లోనే మీకళ్లను మీరే నమ్మలేరు
మీరూ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే వంటగదిలోని ఈ రెండ పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి జీర్ణ సమస్యలు కడుపులో గ్యాస్ వల్ల తలెత్తుతుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే శరీరంపై ప్రమాదకరమైన దుష్ర్ఫభావాలు పడే అవకాశం ఉంది. వంటగదిలో ఉండే బెల్లం, వేయించిన శనగ పప్పుతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేయించిన శనగల్లో బెల్లం కలిపి తింటే జీర్ణశక్తి..
Updated on: Mar 28, 2024 | 12:50 PM

మీరూ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఈ సమస్య నుంచి బయటపడాలంటే వంటగదిలోని ఈ రెండ పదార్ధాలు ఎంతో ఉపయోగపడతాయి. నిజానికి జీర్ణ సమస్యలు కడుపులో గ్యాస్ వల్ల తలెత్తుతుంది. ఈ సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే శరీరంపై ప్రమాదకరమైన దుష్ర్ఫభావాలు పడే అవకాశం ఉంది.

వంటగదిలో ఉండే బెల్లం, వేయించిన శనగ పప్పుతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వేయించిన శనగల్లో బెల్లం కలిపి తింటే జీర్ణశక్తి బలపడుతుంది. అలాగే ఈ రెండు పదార్థాలను కలిపి తీసుకుంటే గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు. బెల్లం, వేయించిన శనగలు కలిపి తినడం వల్ల రోజంతా అలసటగా అనిపించదు.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ ఆహారం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాకుండా, కండరాలకు సంబంధించిన సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు. బెల్లం, శనగలు రెండూ బరువు తగ్గడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. బెల్లంలో ఉండే పీచు పొట్ట నిండుగా ఉంచుతుంది. ఫలితంగా ఎక్కువ సేపు ఆకలి వేయదు.

బెల్లం, వేయించిన శనగల్లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల సహాయంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

రక్తాన్ని శుద్ధి చేయడంలో బెల్లం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే రోజు ఒక బెల్లం ముక్క తినాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి మీరు శరీరంలోని ఈ సమస్యలన్నింటి నుంచి బయటపడాలంటే, ఈ రెండు ఆహారాలను కలిపి తీసుకోవాలి.




