AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో సెన్సెషన్..

ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా ?.. రాజవంశానికి చెందిన అమ్మాయి.. అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు దగ్గరి బంధువు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ప్రేమ, పెళ్లి జీవితాన్ని కుదిపేసినా.. నటిగా తనను నిరూపించుకోవడానికి ఆత్మవిశ్వసంతో ముందుకు నడించింది. మొదటి పెళ్లి విచ్ఛినం కాగా.. ఇప్పుడు రెండో పెళ్లితో మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది.

Tollywood: ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో సెన్సెషన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Mar 28, 2024 | 12:29 PM

Share

ముద్దులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?.. ఇప్పుడు ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. సౌత్ ఇండస్ట్రీలో అందాల రాక్షాసి. అచ్చ తెలుగమ్మాయే అయినా ఈ అందానికి మాత్రం అంతగా గుర్తింపు రాలేదు. అలాగే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో అనేక సినిమాల్లో నటించింది. ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నం సినిమాల్లో ఎక్కువగా కనిపించింది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా ?.. రాజవంశానికి చెందిన అమ్మాయి.. అలాగే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కు దగ్గరి బంధువు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టింది. ప్రేమ, పెళ్లి జీవితాన్ని కుదిపేసినా.. నటిగా తనను నిరూపించుకోవడానికి ఆత్మవిశ్వసంతో ముందుకు నడించింది. మొదటి పెళ్లి విచ్ఛినం కాగా.. ఇప్పుడు రెండో పెళ్లితో మరోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. తనే హీరోయిన్ అదితి రావు హైదరీ.

అదితి రావు హైదరీ పేరు ఇప్పుడు నెట్టింట మారుమోగుతుంది. అందుకు కారణం ఆమె హీరో సిద్దార్థ్ ను రెండో పెళ్లి చేసుకోవడమే. మార్చి 27న వనపర్తిలోని శ్రీరంగనాయక ఆలయంలో వీరి వివాహం సీక్రెట్ గా జరిగింది. అతికొద్దిమంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే తమ పెళ్లిని ఇద్దరు అధికారికంగా ధృవీకరించలేదు. అయితే ఇప్పుడు అదితి గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. 1986 అక్టోబర్ 28న హైదరాబాద్ లో ఎహసాన్ హైదరీ, విద్యారావు దంపతులకు జన్మించింది. ఆమె హైదరాబాద్ నిజాం అయిన మహ్మద్ సాహెల్ కబర్ హైదరీ మనవరాలు..వనపర్తికి చివరి రాజు అయిన రామేశ్వర్ రావు రాజు కుమార్తె కూతురు. అదితికి రెండేళ్ల వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు.

2007లో భారతనాట్యం నర్తికగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది. అదే ఏడాదిలో రొమాంటిక్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీలో మొత్తం 26కు పైగా సినిమాల్లో నటించింది. ఢిల్లీ 6 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దుల్కర్ సల్మాన్ నటించి హై సినామిక సినిమాలో నటించింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన హిరామండీ సినిమాలో నటిస్తుంది. ఓవైపు మూవీ ప్రమోషన్స్ జరుగుతుండగానే.. అదితి తన ప్రియుడు సిద్ధార్థ్ ను సీక్రెట్ గా వివాహం చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
కుజ శుభ సంచారం: మరో వారంలో ఈ రాశుల వారికి అదృష్టం, డబ్బు..
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
గ్రీన్ టీ తాగుతున్నారా? ఈ రెండు సమయాల్లో తాగితే తిప్పలు తప్పవు
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్.
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
ఇక చిరిగిపోని ఇంటర్‌ మార్కుల సర్టిఫికెట్లు.. ఈసారి సరి కొత్తగా..!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
పదేళ్లు పూర్తి చేసుకున్న యూపీఐ సేవలు!
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
చికెన్‌లో ఈ పార్ట్ యమ పవర్‌ఫుల్.. తింటే ఆ రోగాల మాటే ఉండదు..
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
ఐదేళ్లలో సొంతిల్లు కొనేస్తాం.. మహిళల్లో పెరిగిన ఆత్మవిశ్వాసం..!
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
మెడ ఆకారం, పుట్టుమచ్చలు మీ వ్యక్తిత్వం, అదృష్టం గురించి ఏం..
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో అర్థరాత్రి తర్వాత కూడా
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?
కోహ్లీ, రోహిత్ ఎఫెక్ట్.. బీసీసీఐకి కోట్లల్లో లాస్.. ఎందుకంటే?