విశాఖపట్నంలోని లంకెపాలెం వినాయకనగర్‌లో ఓ ఇంటి కబోర్డ్‌లో బజ్జున్న పాము కలకలం రేపింది. చీర తీద్దామని చేయి పెట్టిన ఇంటి యజమానురాలికి పాము బుసకొట్టడంతో భయపడింది. స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ పామును సురక్షితంగా పట్టి, అది విషం లేని జెర్రిగొడ్డు పాము అని గుర్తించారు. ఇలాంటి పరిస్థితుల్లో పాములను చంపవద్దని, స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.