అనంతపురం జిల్లా సిద్ధరాంపురంలో మళ్లీ బర్డ్‌ఫ్లూ విజృంభించింది. ఒక్కరోజే 2,000 కోళ్లు మరణించగా, నమూనాల పరీక్షలో బర్డ్‌ఫ్లూగా నిర్ధారణ అయ్యింది. అధికారులు కిలోమీటరు పరిధిలో రెడ్ జోన్ ప్రకటించి, అవగాహన కల్పిస్తున్నారు. కోళ్లను దాచకుండా పశువైద్యశాఖకు అప్పగించాలని, మానవ ఆరోగ్యంపై కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతున్నారు.