AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ ప్రియుడు చేసిన పనితో ఆమెను భర్త వదిలేశాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..

విజయవాడలో మాజీ ప్రియుడిపై యువతి కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై దాడికి పాల్పడ్డారు. పెళ్లికి ముందు యువతితో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసిన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను ఆమె భర్తకు పంపడంతో కాపురం కూలిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో యువతిని వేధిస్తున్నాడనే ఆరోపణలతో..

మాజీ ప్రియుడు చేసిన పనితో ఆమెను భర్త వదిలేశాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
Ex Lover Attack
M Sivakumar
| Edited By: |

Updated on: Oct 05, 2026 | 4:07 PM

Share

ఒకప్పుడు ప్రేమ.. ఆ తర్వాత పెళ్లి.. కానీ గతం మాత్రం వెంటాడింది.. మాజీ ప్రియుడి దగ్గర ఉన్న ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు చివరకు యువతి భర్తకు చేరాయి.. దీంతో కాపురం కూలిపోయింది.. మాజీ ప్రియుడిపై ఆగ్రహంతో రగిలిపోయిన యువతి కుటుంబ సభ్యులు.. పథకం ప్రకారం అతడిని విజయవాడకు రప్పించి నడిరోడ్డుపై దాడి చేశారు.

పెళ్లికి ముందు యువతికి ఓ యువకుడితో పరిచయం ఉంది.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలు మాజీ ప్రియుడి వద్ద ఉన్నాయి.. యువతికి పెళ్లయిన తర్వాత కూడా వాటిని అడ్డుపెట్టుకుని తనను కలవాలంటూ గత నెల రోజులుగా వేధిస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు యువతికి సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో పాటు.. ఆమె భర్తకు కూడా పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి..

తన భార్యకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో భర్త ఆమెను వదిలేసినట్లు సమాచారం.. దీంతో విషయం కుటుంబ సభ్యులకు చెప్పింది యువతి. మాజీ ప్రియుడి వ్యవహారంపై ఆగ్రహంతో ఉన్న కుటుంబ సభ్యులు.. అతడిని విజయవాడకు రప్పించారు.. పీవీపీ మాల్స్ సమీపంలో అతడు ఉండగా చుట్టుముట్టి దాడికి దిగారు..

స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గకుండా దాడి చేసినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. దాడిలో గాయపడిన మాజీ ప్రియుడిని అదుపులోకి తీసుకుని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు..

ఇప్పుడు ఈ ఘటనలో రెండు కోణాలు కీలకంగా మారాయి.. ఒకవైపు వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో యువతిని బెదిరించాడనే ఆరోపణలు.. మరోవైపు మాజీ ప్రియుడిపై కుటుంబ సభ్యులు దాడి చేసిన ఘటన. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు ఎవరు పెట్టారు.. భర్తకు వాటిని ఎవరు పంపారు.. యువతిని మాజీ ప్రియుడు నిజంగానే బెదిరించాడా.. పీవీపీ మాల్ దగ్గర దాడికి ఎవరు పాల్పడ్డారు.. అన్నదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు..

ప్రేమగా మొదలైన పరిచయం.. పెళ్లి తర్వాత వివాదంగా మారింది.. వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో మొదలైన బెదిరింపుల ఆరోపణలు.. చివరకు నడిరోడ్డుపై దాడి వరకు వెళ్లాయి.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తుతో అసలు నిజం తేలాల్సి ఉంది.

Follow Us