- Telugu News Photo Gallery Do You Know Why Toilet Doors In Malls and Theatres Have A Gap At The Bottom?
Public Toilets: పబ్లిక్ టాయిలెట్లలో డోర్లు కింద గ్యాప్ ఎందుకు ఉంటుందో తెలుసా?
నేటి రోజుల్లో ప్రతి ఇంట్లో టాయిలెట్లు ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే టాయిలెట్ డోర్లు ఇంటి తలుపులు మాదిరి పూర్తిగా కవర్ చేస్తాయి. కానీ పబ్లిక్ టాయిలెట్లు మాత్రం అలా కాదు. వీటి తలుపు అడుగున చాలా ఖాళీ ఉంటుంది. ఇలాంటి డోర్లు మాల్స్, థియేటర్లలో ఎక్కువగా కనిపిస్తాయి..
Updated on: Aug 02, 2025 | 9:22 PM

పబ్లిక్ ప్రదేశాలలో టాయిలెట్ తలుపు కింద స్థలం కనిపిస్తుంది. లోన ఉన్నవారి పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీని వెనుక కారణం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం..

పబ్లిక్ టాయిలెట్లలో డోర్ కింద ఇలా స్థలం వదలడానికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇలాంటి టాయిలెట్లను శుభ్రం చేయడానికి.. సిబ్బంది అనువుగా ఉంటాయి. శుభ్రపరిచే సిబ్బంది తలుపు తెరవకుండానే శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. దీనివల్ల టాయిలెట్లను వేగంగా శుభ్రం చేయవచ్చు.

ఒక వ్యక్తి టాయిలెట్‌లో స్పృహ కోల్పోవడం, లేదంటే అస్వస్థతకు గురికావడం వంటి సంఘటనలు తలెత్తితే వారు కింద పడిపోతారు. అలాంటి వారికి అత్యవసర చికిత్స అందించడానికి డోర్ బయటి నుంచే గుర్తించడానికి వీలుంటుంది. దీనివల్ల తలుపు పగలగొట్టకుండానే వారికి సహాయం చేయవచ్చు.

కొన్ని సార్లు థియేటర్‌లోని టాయిలెట్లలో దాక్కుని పొగ తాగడానికి లేదా ఏవైనా ఇల్లీగల్ పనులు చేయడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే, అలాంటి వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించడానికి ఇలాంటి తలుపులు అనువుగా ఉంటాయి.

పొడవైన టాయిలెట్ తలుపు తయారు చేయడానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. టాయిలెట్‌లోని తేమ, నీటి కారణంగా తలుపు దిగువ భాగం త్వరగా దెబ్బతింటుంది. అయితే ఇలా కింద ఖాళీ స్థలం ఉంటే తలుపు దెబ్బతినకుండా నాణ్యంగా ఉంటాయి. అంతేకాకుండా టాయిలెట్లలో గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. అయితే తలుపు దిగువ భాగం తెరిచి ఉండటం వలన, గాలి, వెలుతురు బాగా ప్రసరిస్తాయి.




