Pumpkin Seeds: గుమ్మడి గింజలు పడేస్తున్నారా? రక్తపోటు అదుపులో ఉండాలంటే రోజూ కాసిన్ని తిన్నా చాలు..
నేటి కాలంలో అనేక మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిజానికి.. ఇది ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి. అధిక రక్తపోటు వల్ల ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ వ్యాధి స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు కళ్లకు కూడా ప్రమాదకరమే. ప్రతిరోజూ మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి. ఔషధంతో పాటు అధిక రక్తపోటును తగ్గించడానికి ఆహారంలో గుమ్మడి గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..
Updated on: Mar 07, 2024 | 8:15 PM

నేటి కాలంలో అనేక మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. నిజానికి.. ఇది ఆరోగ్యాన్ని నెమ్మదిగా నాశనం చేసే వ్యాధి. అధిక రక్తపోటు వల్ల ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను కూడా కలిగిస్తుంది. ఈ వ్యాధి స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు కళ్లకు కూడా ప్రమాదకరమే. ప్రతిరోజూ మందులు వాడుతూ అదుపులో ఉంచుకోవాలి. ఔషధంతో పాటు అధిక రక్తపోటును తగ్గించడానికి ఆహారంలో గుమ్మడి గింజలను తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

అధిక రక్తపోటుతో బాధపడేవారు గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల వీటిల్లోని పోషకాలు రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. గుమ్మడికాయ గింజలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త నాళాలు విస్తరించడానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఈ గింజల్లో ఫైబర్, రౌగేజ్ అధికంగా ఉంటుంది.

వీటిల్లోని ఫైబర్, రఫ్‌గేజ్ ధమనులలో కొలెస్ట్రాల్ నిక్షేపాలు కరిగిపోయేలా చేస్తాయి. గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడంతోపాటు స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

కానీ అనేక చాలా మంది గుమ్మడి విత్తనాలను ఎండిన తర్వాత తినడానికి ఇష్టపడతారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, అధిక రక్తపోటు సమస్య ఉంటే గుమ్మడి గింజలను పచ్చిగా తినడం మంచిది. అవసరమైతే కొద్దిగా ఎండనిచ్చి తినవచ్చు. కానీ పూర్తిగా ఎండిన తర్వాత తినడం కంటే పచ్చిగా తింటే మరింత ప్రయోజనం పొందవచ్చు.

వీటి రుచిని పెంచేందుకు నానబెట్టి కూడా తినవచ్చు. కాబట్టి మీకు నచ్చినా, లేకున్నా ఈ విత్తనాలను ప్రతి రోజూ మీ ఆహారంలో భాగంగా తీసుకోవడ మర్చిపోకండి. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడేవారు గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తినాలంటున్నారు పోషకాహార నిపుణులు.




