- Telugu News Photo Gallery Do not do these things even by mistake on Naga Panchami day, Check Here is Details
Naga Panchami: నాగ పంచమి రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు..
నాగ పంచమి రోజు గురించి అందరికీ తెలుసు. ఈ రోజున మహిళలు అందరూ పామును దేవతగా పూజించి ప్రార్థిస్తారు. పుట్టలో పాలు, పసుపు, కుంకుమ కూడా పోసి పూజలు చేస్తారు. ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీన శుక్రవారం నాగ పంచమ వచ్చింది. నాగ పంచమి రోజు పాములను పూజిస్తే జాతకంలో ఉండే కాలసర్పదోషం వంటివి పోతాయని నమ్మకం. బ్రహ్మ పురాణం ప్రకారం నాగ పంచమి రోజున పాములను పూజించడానికి బ్రహ్మ దేవుడు..
Updated on: Aug 08, 2024 | 7:16 PM

నాగ పంచమి రోజు గురించి అందరికీ తెలుసు. ఈ రోజున మహిళలు అందరూ పామును దేవతగా పూజించి ప్రార్థిస్తారు. పుట్టలో పాలు, పసుపు, కుంకుమ కూడా పోసి పూజలు చేస్తారు. ఈ ఏడాది ఆగష్టు 9వ తేదీన శుక్రవారం నాగ పంచమ వచ్చింది.

నాగ పంచమి రోజు పాములను పూజిస్తే జాతకంలో ఉండే కాలసర్పదోషం వంటివి పోతాయని నమ్మకం. బ్రహ్మ పురాణం ప్రకారం నాగ పంచమి రోజున పాములను పూజించడానికి బ్రహ్మ దేవుడు వరం ఇచ్చాడు. అయితే నాగ పంచమి రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నాగ పంచమి రోజున మట్టిని తవ్వే ఎలాంటి పనులు కూడా చేయకూడదు. అదే విధంగా భూమిని దున్నడం, పొలాన్ని కూడా దున్నకూడదు. నాగ పంచమి రోజు ఆకు కూరలు కూడా కోయ కూడదని అంటారు. అదే విధంగా ఈ రోజున పాములకు ఎలాంటి హాని చేయకూడదు.

ఇలా చేయడం వల్ల సంతానం నశించే అవకాశం ఉందట. అలాగే ఈ రోజున బ్రతికి ఉన్న పాములకు పాలు తాగించకూడదు. కేవలం విగ్రహాలకు మాత్రమే పాలతో అభిషేకం చేయాలి.

నాగ పంచమి రోజున కత్తులు, సూదులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. నాగ పంచమి రోజున ఇనుప కళాయిలు, పాన్లలో ఆహారం వండకూడదు.. తినకూడదు.




