- Telugu News Photo Gallery Cricket photos Team India Captain Rohit Sharma White Ball Cricket Career May End After South Africa ODI Series Says Reports
Rohit Sharma: హిట్‌మ్యాన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. కెప్టెన్‌గా చివరి వన్డే సిరీస్ ఆడనున్న రోహిత్.. ఎప్పుడంటే?
Rohit Sharma White Ball Cricket Career: ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే ప్రపంచకప్ రెండింటికీ టీమ్ ఇండియా కొత్త కెప్టెన్‌ను రంగంలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రోజుల్లో వైట్ బాల్ అంటే వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి రోహిత్ శర్మతో చర్చిస్తుంది. టీ20 క్రికెట్ ఆడటం తనకు ఇష్టం లేదని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇప్పుడు వన్డేల్లో అతని భవిష్యత్తు గురించి సెలక్టర్లు అతనితో చర్చించనున్నారు.
Updated on: Nov 22, 2023 | 7:08 PM

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో అజేయంగా టీమిండియాను ఫైనల్స్‌కు చేర్చిన రోహిత్ శర్మ (Rohit Sharma).. ఫైనల్ మ్యాచ్‌లో ఓటమి షాక్‌తో జట్టుకు దూరమయ్యాడు. ఆస్ట్రేలియా (India vs Australia)తో రేపటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ నుంచి రోహిత్‌తో పాటు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతి లభించింది. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. హిట్‌మ్యాన్‌గా పేరొందిన రోహిత్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. పొట్టి మోడల్‌కు దూరంగా ఉండాలని ఆయన ఇప్పటికే భారత సెలక్టర్లతో మాట్లాడినట్లు కూడా నివేదికలు పేర్కొంటున్నాయి.

నివేదిక ప్రకారం, రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉండటం గురించి సెలెక్టర్లతో మాట్లాడాడు. కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించేందుకే హిట్‌మ్యాన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని, టీ20 జట్టులోకి ఎంపిక కాకపోయినా ఇబ్బంది లేదని రోహిత్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రోహిత్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం అతని వన్డే కెరీర్‌పై కూడా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఎందుకంటే తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో జరగనుంది. ప్రస్తుతం 36 ఏళ్ల వయసున్న రోహిత్‌కి అప్పుడు 40 ఏళ్లు ఉంటాయి. కాబట్టి, ఆ వయసులో ఆ టోర్నీలో ఆడగలడా అనేది ప్రశ్నగా మారింది. అంతకంటే ముందు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కూడా జరుగుతోంది. ఆ టోర్నీలో కూడా రోహిత్ ఆడుతాడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీ, 2027 వన్డే ప్రపంచకప్ రెండింటికీ కొత్త కెప్టెన్‌తో టీమ్ ఇండియా రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాబోయే రోజుల్లో వైట్ బాల్ అంటే వన్డే క్రికెట్ భవిష్యత్తు గురించి రోహిత్ శర్మతో చర్చి్ంచనుందంట. తదుపరి వన్డే ప్రపంచకప్ 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మకు 40 ఏళ్లు ఉంటాయి. వచ్చే ఏడాది 2024లో టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఈ ప్రపంచకప్ టోర్నీ అమెరికా-వెస్టిండీస్‌లో జరగనుంది. అప్పుడు రోహిత్ శర్మ వయసు 37 ఏళ్లు. అప్పటి వరకు రోహిత్ టీమ్ ఇండియాకు ఆడే అవకాశాలు తక్కువే. అయితే, విరాట్ కోహ్లీ ఇప్పటికే T20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నాడు. తద్వారా రానున్న రోజుల్లో టీమ్ ఇండియాలో మార్పుల సీజన్ ప్రారంభం కానుంది.

టీ20 క్రికెట్ ఆడటం తనకు ఇష్టం లేదని రోహిత్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ఇప్పుడు వన్డేల్లో అతని భవిష్యత్తు గురించి సెలక్టర్లు అతనితో చర్చించనున్నారు. డిసెంబర్ 26 నుంచి దక్షిణాఫ్రికాలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. అంతకుముందు టీమిండియా మూడు వన్డేలు కూడా ఆడనుంది. టెస్టుల్లో ఆడే ముందు సన్నద్ధమయ్యేందుకు సీనియర్లకు వన్డే సిరీస్ మంచి అవకాశమని బీసీసీఐ సెలక్టర్లు అభిప్రాయపడ్డారు. గాయం కారణంగా హార్దిక్ పాండ్యా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడం లేదు. కాబట్టి, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్ వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చివరి సిరీస్ కావచ్చు.




