- Telugu News Photo Gallery Cricket photos All rounder Hardik Pandya may ruled out from India tour of Australia due to Injury
IND vs AUS: ఆసీస్ పర్యటనకు ముందే షాకింగ్ న్యూస్.. స్వ్కాడ్ నుంచి టీమిండియా ఆల్ రౌండర్ ఔట్..?
India Tour of Australia: భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ జట్టుకు దూరం కావొచ్చని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆసియా కప్‌లో గాయం ఇంకా తగ్గలేదని తెలుస్తోంది.
Updated on: Sep 30, 2025 | 5:04 PM

India Tour of Australia: వచ్చే నెలలో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన ప్రారంభమవుతుంది. ఈ వైట్-బాల్ క్రికెట్ సిరీస్‌లో హార్దిక్ పాండ్యా భారత జట్టుకు కీలకమైన ఆస్తిగా ఉండేవాడు. అయితే, ఇప్పుడు అతను భారత జట్టు నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతను లేకుండానే టీమిండియా ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉంటుంది. భారత ఆల్ రౌండర్ తన గాయం నుంచి కోలుకోలేదని, ఈ క్రమంలోనే 2025 ఆసియా కప్ ఫైనల్‌లో ఆడకుండా డగౌట్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

శ్రీలంకతో జరిగిన చివరి సూపర్ ఫోర్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయం గురించి వార్తలు వచ్చాయి. అతనికి ఎడమ క్వాడ్రిసెప్స్ గాయం, తొడ కండరాల గాయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆసియా కప్ సందర్భంగా వ్యాఖ్యాతగా పనిచేస్తున్న రవిశాస్త్రి పాండ్యా గాయం గురించి సమాచారం అందించాడు.

వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన అక్టోబర్ 19న ప్రారంభమై నవంబర్ 8న ముగుస్తుంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, పాండ్యా ప్రస్తుత గాయం కోలుకోవడానికి నాలుగు వారాల సమయం పట్టవచ్చు.

అంటే, దీని అర్థం అతను మొదట్లో టీం ఇండియాతో పర్యటనకు వెళ్లకపోయినా, చివరికి కొన్ని టీ20 మ్యాచ్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే, బీసీసీఐ వైద్య బృందం పరీక్ష తర్వాతే ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అక్టోబర్ 19, అక్టోబర్ 23, అక్టోబర్ 25 తేదీల్లో జరిగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు మొదట వన్డే సిరీస్ ఆడనుంది. మూడు వన్డేల తర్వాత, ఐదు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ అక్టోబర్ 29న ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లు నవంబర్ 8 వరకు జరుగుతాయి. అక్టోబర్ 29న జరిగే మొదటి టీ20 తర్వాత, భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 31న రెండో టీ20, నవంబర్ 2న మూడో టీ20, నవంబర్ 6న నాలుగో టీ20, నవంబర్ 8న ఐదో టీ20 జరుగుతాయి. వన్డే మ్యాచ్‌లు పెర్త్, అడిలైడ్, సిడ్నీలలో జరుగుతాయి. టీ20ఐ మ్యాచ్‌లు కాన్‌బెర్రా, మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్, బ్రిస్బేన్‌లలో జరుగుతాయి.




