- Telugu News Photo Gallery Coffee Benefits for Skin: Benefits Of Using Coffee For Your Face And Skin, Know here
Coffee Benefits for Skin: ముఖారవిందానికి కాస్తింత కాఫీ పొడి.. మీ కళ్లను మీరే నమ్మలేరు!
ఉదయం నిద్ర లేవగానే ఘుమఘుమలాడే కప్పు కాఫీ తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, పని చేసే శక్తిని మెరుగుపరుస్తుంది. కాఫీలోని కెఫిన్ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అయితే ఇంతకు మించిన గుణాలు కూడా కాఫీలో ఉన్నాయి. కాఫీ అనేక చర్మ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. చర్మ సంరక్షణలో ఈ యాంటీఆక్సిడెంట్-రిచ్ పదార్ధం ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Feb 15, 2024 | 7:01 PM

ఉదయం నిద్ర లేవగానే ఘుమఘుమలాడే కప్పు కాఫీ తాగితే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో రోజుకో కప్పు కాఫీ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, పని చేసే శక్తిని మెరుగుపరుస్తుంది. కాఫీలోని కెఫిన్ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది.

అయితే ఇంతకు మించిన గుణాలు కూడా కాఫీలో ఉన్నాయి. కాఫీ అనేక చర్మ సమస్యలకు నివారిణిగా పనిచేస్తుంది. చర్మ సంరక్షణలో ఈ యాంటీఆక్సిడెంట్-రిచ్ పదార్ధం ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు ఏర్పడతాయి. కాబట్టి చర్మంపై వృద్ధాప్య సంకేతాలు నివారించడంలో కాఫీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. పాలు, నిమ్మరసం, తేనెతో కాఫీ మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు సులభంగా తొలగిపోతాయి. ఒక చెంచా తేనెతో కాఫీ పౌడర్ మిక్స్ చేసి కళ్ల కింద 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. ఇలా ఒక వారం పాటు చేసి చూడండి. కళ్ల కింద నల్లటి వలయాలు ఇట్టే మాయమవుతాయి.

అంతేకాదు కాఫీ వల్ల మొటిమల సమస్యల నుంచి కూడా బయటపడొచ్చు. చర్మం మంటను తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది. కాఫీకి కొబ్బరినూనె మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. పది నిమిషాల తర్వాత చేతులతో తేలికగా స్క్రబ్ చేసి కడిగేయాలి. తరచూ ఈ ఇలా చేయడం వల్ల చర్మం క్రమంగా ప్రకాశవంతంగా మారడం మీరే చూస్తారు.

శీతాకాలపు చర్మం పొడిబారితే.. అలోవెరా జెల్‌తో కాఫీ పొడిని మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఎలాంటి వాతావరణంలోనైనా చర్మం తేమను కాపాడుకోవడానికి సహాయపడుతుంది.




