- Telugu News Photo Gallery Enhance your facial beauty with mint leaves, check here is details in Telugu
Skin Care: పుదీనాతో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండిలా..
పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనాతో శరీరంలోనే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. హోమ్ మేడ్ మెడిసిన్‌లో పుదీనా ఖచ్చితంగా ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా పుదీనాను ఔషధంగా వినియోగిస్తారు. ఇప్పుడు పుదీనాతో మీ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు. తరచూ పుదీనా ఆకులు తినడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పింపుల్స్ నుంచి ఉపశమనం పొందాలంటే..
Updated on: Feb 15, 2024 | 6:00 PM

పుదీనా ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనాతో శరీరంలోనే అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. హోమ్ మేడ్ మెడిసిన్‌లో పుదీనా ఖచ్చితంగా ఉంటుంది. ఆయుర్వేదంలో కూడా పుదీనాను ఔషధంగా వినియోగిస్తారు. ఇప్పుడు పుదీనాతో మీ ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అంతే కాకుండా ఆరోగ్యంగా కూడా ఉంటారు.

తరచూ పుదీనా ఆకులు తినడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీని వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పింపుల్స్ నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మ రసం, పుదీనా పేస్ట్ కలిపి రాస్తే సమస్య తొలగిపోతుంది.

ముఖానికి గ్లో వచ్చి, రంగు మారాలంటే.. పుదీనా ఔషధంగా పని చేస్తుంది. పుదీనాను పేస్ట్‌లా చేసుకుని అందులో తేనె కలిపి ముఖానికి రాయడం వల్ల చలువ చేస్తుంది. అంతే కాకుండా నిగారింపు కూడా పెరుగుతుంది.

అలాగే పుదీనాను పేస్ట్‌లా చేసి నేరుగా మీ ముఖంపై అప్లై చేసి.. ఆరాక కడిగేయడం వల్ల.. చర్మానికి సంబంధించిన సమస్యలు అన్నీ కంట్రోల్ అవుతాయి. జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బెస్ట్. జిడ్డు తగ్గి.. స్కిన్ కాంతివంతంగా కనిపిస్తుంది.

అలాగే పుదీనా, దోసకాయను పేస్ట్‌లా తయారు చేసి.. ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం చల్లబడుతుంది. సమ్మర్‌లో ఈ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది. ఎండ నుంచి ఉపశమనం లభిస్తుంది. దోసకాయలు, పుదీనాలో ఉండే గుణాలు చర్మాన్ని చల్లబరుస్తుంది.




