- Telugu News Photo Gallery Cinema photos Vaishnavi Chaitanya New Photos goes Attractive in Social media on 19 08 2023 Telugu Actress Photos
Vaishnavi Chaitanya: ఒక్క మూవీతో దశ తిరిగిపోయిందిగా.. పెద్ద డైరెక్టర్స్ తో వైష్ణవి చైతన్య.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో బేబీ సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ నటించాడు. అలాగే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగింది.
Updated on: Aug 19, 2023 | 7:16 PM

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాల్లో బేబీ సినిమా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది ఈ సినిమా.

సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోగా ఆనంద్ దేవరకొండ నటించాడు. అలాగే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాతో ఒక్కసారిగా వైష్ణవి చైతన్య పేరు మారుమ్రోగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన వైష్ణవి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. బేబీ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

దాంతో వైష్ణవికి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడికి ఓ భారీ ఆఫర్ కూడా వచ్చిందని తెలుస్తోంది.

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో రానున్న సినిమాలో నటించే ఛాన్స్ అందుకుందట వైష్ణవి.రామ్ పోతినేని హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది.

ఇదిలా ఉంటే వైష్ణవి కు ఈ సినిమా తర్వాత ఫ్యాన్స్ భారీగా పెరిగిపోయారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు సినిమాల ఎంపిక విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు.

వైష్ణవి ఎలాంటి కథలను ఎంచుకుంటుంది అంటూ చర్చించుకుంటున్నారు ఫ్యాన్స్. బేబీ సినిమాలో వైష్ణవి నటనకు ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు.




