- Telugu News Photo Gallery Cinema photos Tollywood to Bollywood Latest New Movies Topics on 19th august 2023 telugu cinema news
Tollywood: ఆహాలో అలరించనున్న బేబీ.. ఇక సలార్ ఐమాక్స్ వెర్షన్ రాబోతుంది..
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్. సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను ఐమాక్స్ వర్షన్‌లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్నారు.
Updated on: Aug 19, 2023 | 11:25 PM

Baby - ఆహాలో బేబీ బ్లాక్ బస్టర్ బేబీ ఓటీటీ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవీ చైతన్య లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 ఆహాలో స్ట్రీమ్ కానుంది. బోల్డ్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ మూవీకి సాయి రాజేష్ దర్శకుడు. జూలై 14న థియేట్రిలక్ రిలీజ్ అయిన ఈ సినిమా వంద కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది.

Salaar - సలార్ ఐమాక్స్ వర్షన్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్. సెప్టెంబర్ 28న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ పాన్ ఇండియా సినిమాను ఐమాక్స్ వర్షన్‌లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్నారు.

Swayambhu - స్వయంభు మొదలైంది నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ప్రీరియాడిక్ మూవీ స్వయంభు. నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా షూటింగ్ శుక్రవారం ప్రారంభమైంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్. కేజీఎఫ్ ఫేమ్ రవి బసూర్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను 2024లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Akshay kumar - ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఓ మై గాడ్ 2 సినిమాకు అక్షయ్ కుమార్ వంద కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ స్పందించింది. ఆ సినిమాలో నటించేందుకు అక్షయ్, ఒక్క రూపాయి పేమెంట్ కూడా తీసుకోలేదని వెల్లడించింది. నిర్మాణ భాగస్వామి కూడా అయిన అక్కి, సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో ఉంచేందుకు అన్ని రకాలుగా హెల్ప్ చేశారని తెలిపింది.

Vivek - కరణ్, షారూఖ్ వల్లే! ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్స్ కరణ్ జోహార్, షారూఖ్ ఖాన్ సినిమాలు ఇండియన్ కల్చర్‌ను దెబ్బతీశాయన్నారు. కమర్షియల్ ట్రెండ్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీ నిజమైన కథలను చెప్పటం మానేసిందన్న వివేక్, ప్రస్తుతం ప్రజలకు ఒరిజినల్ స్టోరిస్ చెప్పే టైమ్ వచ్చిందన్నారు.




