- Telugu News Photo Gallery Cinema photos Meenakshi Chaudhary new glamorous photos in social media 19 08 2023 Telugu Actress Photos
Meenakshi Chaudhary: టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్ లో చాక్లెట్ బ్యూటీ ‘మీనాక్షి చౌదరి’..
మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ.. ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో..
Updated on: Aug 19, 2023 | 5:07 PM

మీనాక్షి చౌదరి.. ఈ అమ్మడి పేరు ఇప్పుడు తెగ వినిపిస్తుంది.. సుశాంత్ నటించిన ఇచట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ..

ఈ అమ్మడు తొలి సినిమాతోనే అందం అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ లుక్స్ తో కట్టిపడేసిన మీనాక్షికి ఇప్పుడు తెలుగులో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఫుల్ బిజీ గా ఉన్న యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.. ఆల్రెడీ రవి తేజ లాంటి సీనియర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ప్రెజెంట్ త్రివిక్రమ్ - మహేష్ కాంబినేషన్ లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు.

గుంటూరు కారం తో పాటు మరో కొన్ని సినిమాల్లో నటిస్తున్న మీనాక్షి చౌదరి మూవీస్ సెలెక్షన్స్ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నారు.

గుంటూరు కారంలో మీనాక్షి చౌదరి మాత్రమే కాదు, శ్రీలీల కూడా నాయికగా నటిస్తున్నారు. మహేష్ పక్కన ముందు ఈ సినిమాలో పూజా హెగ్డేని ఫిక్స్ చేశారు. అయితే ఆమె కాల్షీట్లు సర్దుబాటు చేయలేక విత్ డ్రా కావడంతో, ఆ ప్లేస్‌కి ఎంట్రీ ఇచ్చారు మీనాక్షి చౌదరి.

విశ్వక్‌సేన్ హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కిస్తున్న సినిమాలోనూ మీనాక్షి పేరు వినిపిస్తోంది. మట్కా, వెంకీ అట్లూరి డైరక్షన్‌లో దుల్కర్ సల్మాన్ చేస్తున్న సినిమాలోనూ ఈ భామ పేరే ఖరారవుతుందంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. వరుసగా అవకాశాలతో ఓవర్‌నైట్ స్టార్‌డమ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ లేడీ.




